మలయాళ నటి నజ్రియా.. తన తొలి తెలుగు సినిమా 'అంటే సుందరానికి' షూటింగ్లో పాల్గొంది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. హీరో నాని, త్వరలో చిత్రీకరణకు హాజరు కానున్నట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా 'బతుకే బస్టాండ్'. దీని గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. ఐఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడించనున్నారు.
ఇది చదవండి: 'ఆచార్య', 'థాంక్యూ' సినిమాలపై కరోనా ఎఫెక్ట్!