ETV Bharat / sitara

'మహేశ్​ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయారు' - Sarkar vaari paata movie news

సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన చిత్రాల్లో 'ఒక్కడు' సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశానని చెబుతున్నారు నటి, మహేశ్​బాబు సతీమణి నమ్రత. కృష్ణ తన కూలెస్ట్​ మామయ్య అంటూ ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో సరదాగా ముచ్చటించారు.

Actress Namrata Shirodkar Chitchat With Her Instagram Followers
'మహేశ్​ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయారు'
author img

By

Published : Jul 1, 2020, 8:59 AM IST

"సర్కారు వారి పాట' చిత్రం చూసి మీరు నిజంగా చాలా ఆనందిస్తారు" అంటున్నారు నటి, మహేశ్​బాబు సతీమణి నమ్రత. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె.. మహేశ్​ గురించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మంచిగా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, టైంకి నిద్ర పోవడం.. ఇవే తన ఫిట్‌నెస్‌ రహస్యమని చెప్పారామె.

కూలెస్ట్​ మామయ్య

తెలుగు చిత్ర సీమలో బాగా ఇష్టపడే నటుడెవరంటే.. మరో మాట లేకుండా మహేశ్​ పేరే చెప్తానన్నారు. ఇక తన అభిమాన నటి మెరిల్‌ స్ట్రీప్‌ అన్నారు. కృష్ణగారు చాలా కూలెస్ట్‌ మామయ్య అని, నాకు తండ్రి కన్నా ఎక్కువని తెలియజేశారామె. "మహేశ్​ స్క్రిప్ట్‌ సెలక్షన్స్‌లో మీ పాత్ర ఎంత ఉంటుంది?" అని ప్రశ్నించగా.. ఆయన పనుల్లో నేనెప్పుడూ కలుగజేసుకోనని తెలిపారు. మహేశ్​ చిత్రాల్లో 'ఒక్కడు', 'పోకిరి', 'దూకుడు', 'భరత్‌ అనే నేను', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా 'ఒక్కడు' చిత్రాన్ని లెక్కలేనన్ని సార్లు చూసినట్లు చెప్పారు.

Actress Namrata Shirodkar Chitchat With Her Instagram Followers
నమ్రతా శిరోద్కర్​, మహేశ్​బాబు

మహేశ్​ను చూసి ప్రేమలో పడ్డారు

మహేశ్​ ఇంట్లో ఉంటే పిల్లలతో కలిసి టెన్నిస్‌, గోల్ఫ్‌, సెవెన్‌ పిన్స్‌ గేమ్స్‌ ఎక్కువ ఆడుతుంటారన్నారు. "మహేశ్​ను ప్రేమిస్తున్నారని మీకెప్పుడు తెలిసింద"ని ప్రశ్నించగా.. "52రోజుల సుదీర్ఘ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌లో ఆఖరిరోజు నాకు ఆ విషయం అర్థమైంద"ని చెప్పారు. మరి "మహేశ్​ను చేసుకోవడానికి మీ తల్లిదండ్రులు వెంటనే ఒప్పుకొన్నారా?" అని అడగ్గా.. "మహేశ్​ను చూసిన వెంటనే వారు ఆయన ప్రేమలో పడిపోయార"ని బదులిచ్చారు.

ఇదీ చూడండి... మహేశ్ ఫ్యామిలీకి రష్మిక సర్​ప్రైజ్ గిఫ్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.