ETV Bharat / sitara

'దిల్‌ బెచారా' చూసి నటి కృతిసనన్‌ భావోద్వేగం - susanth singh rajput news

దివంగత నటుడు సుశాంత్ సింగ్ చివరి చిత్రం 'దిల్​ బెచారా' జులై 24 ఓటీటీలో విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. సినిమా చూసిన నటి కృతి సనన్​.. భావోద్వేగంతో ఓ పోస్టు పెట్టింది.

dil bechara
'దిల్‌ బెచారా' చూసి నటి కృతిసనన్‌ భావోద్వేగం
author img

By

Published : Jul 27, 2020, 12:43 PM IST

సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ చివరి సారిగా నటించిన చిత్రం 'దిల్‌ బెచారా'. సంజనా సంఘీ కథానాయిక. ముఖేశ్‌ చబ్రా దర్శకుడు. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా సుశాంత్‌ నటన చూసి అతడు ఈ లోకంలో లేడన్న విషయం గుర్తొచ్చి.. అభిమానులందరూ భావోద్వేగానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో నటి కృతి సనన్‌ ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేసింది. గతంలో వీరిద్దరూ 'రాబ్తా'లో కలిసి నటించారు.

"దీన్ని జీర్ణించుకోలేకపోతున్నా. స్క్రీన్‌పై మ్యానీ(దిల్‌ బేచారాలో సుశాంత్‌ పేరు)ని చూసి పదే పదే నా హృదయం బద్దలైపోతోంది. ఎన్నో సందర్భాల్లో నువ్వు నిజంగా జీవించి వచ్చావనిపించింది. నీ అసలైన వ్యక్తిత్వాన్ని ఆ పాత్రలో పెట్టి నటించావు. నువ్వు నిశబ్ధంగా ఉన్న సన్నివేశాలన్నీ మేజిక్‌లా అనిపించాయి" అని రాసుకొచ్చింది.

ఈ సందర్భంగా దర్శకుడు ముఖేశ్‌ చబ్రా, కథానాయిక సంజనా సంఘీలకు శుభాకాంక్షలు తెలిపారు కృతి. "ముఖేశ్‌ ఈ సినిమా మీకు ఎంతో ముఖ్యమన్న విషయం తెలుసు. తొలి చిత్రంతోనే భావోద్వేగాలకు గురి చేశారు. సంజనా మీ కెరీర్‌ అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా" అని కృతి చెప్పుకొచ్చింది.

ఈ సినిమా విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఏ చిత్రానికి సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐఎమ్​డీబీలో తొలుత 10/10 రేటింగ్​ అందుకుంది. ప్రస్తుతం 9.5 రేటింగ్​తో కొనసాగుతోంది. టాప్​ రేటెడ్​ ఇండియన్​ మూవీస్​ జాబితాలోనూ తొలి స్థానం చేజిక్కించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.