కరోనా ప్రభావంతో మన సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దానికితోడు పలువురు నటీనటులు, గాయకులు, ఇతరత్రా సాంకేతిక నిపుణులు కూడా ఈ వైరస్‌తో పోరాడుతూ మరణిస్తుండటం.. అభిమానుల్ని బాధపెడుతోంది. అయితే నటి కవిత ఇంట్లోనూ కొవిడ్ వల్ల తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు, భర్త.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మృతి చెందారు.
కవిత కుమారుడు సంజయ్.. కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడ్డారు. ఆ వైరస్‌తో పోరాడుతూ జూన్ 16న తుదిశ్వాస విడిచారు. అప్పటికే కొవిడ్‌కు గురైన ఆమె భర్త.. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ ఆరోగ్యం విషమించడం వల్ల జూన్ 30న మరణించారు.
ఇవీ చదవండి: