ETV Bharat / sitara

వివాదాల నడుమ ముంబయికి కంగన - కంగనా రనౌత్​ బాలీవుడ్​ మాఫీయా న్యూస్​

ముంబయిను పాక్​ ఆక్రమిత కశ్మీర్​తో పోలుస్తూ​ నటి కంగన ట్వీట్​ చేయడం.. శివసేన నేత సంజయ్​ రౌత్​ ఆమైపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఇలాంటి పరిస్థితుల్లోనే బుధవారం ఉదయం మనాలి నుంచి ముంబయికి బయలుదేరనుంది కంగన.

actress Kangana Ranaut tests negative, leaves for Mumbai
వివాదాల నడుమ ముంబయికి పయనమైన కంగన
author img

By

Published : Sep 9, 2020, 8:49 AM IST

Updated : Sep 9, 2020, 10:58 AM IST

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇటీవలే వార్తల్లో నిలిచిన నటి కంగనా రనౌత్.. చెప్పినట్లు గానే ముంబయికి పయనమైంది. కొవిడ్ పరీక్షలు చేయించుకుని అందులో నెగిటివ్​గా తేలింది. దీంతో చండీగఢ్ ఎయిర్​పోర్ట్​లో విమానమెక్కనుంది. ముంబయికి చేరుకున్నాక తనను హోమ్​ క్వారంటైన్​లో ఉంచాలని మున్సిపల్​ అధికారులు సిద్ధంగా ఉన్నారు.

బాలీవుడ్​ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే ఎక్కువగా భయపడుతున్నానని ఈ మధ్యే కంగన చెప్పింది. దీంతో శివసేన నేత సంజయ్​ రౌత్​, ఆమెను ముంబయి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. స్పందించిన కంగన.. ముంబయిని పాక్​ ఆక్రమిత కశ్మీర్​తో పోలుస్తూ ట్వీట్​ చేసింది. తద్వారా ఈ వివాదం మరింత వేడెక్కింది. ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో కంగనకు వై- ప్లస్​ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

ముంబయికి పయనమైన నటి కంగనా రనౌత్​

కంగన ఆఫీసుకు నోటీసులు

ముంబయిలోని తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని కంగన​ ఆరోపించింది. తన పొరుగువారిని కూడా వేధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తనకు సమాచారం ఇచ్చినట్లు ట్విట్టర్​లో వెల్లడించింది కంగన.

  • Himachal Pradesh: Actor Kangana Ranaut leaves from Bhanwla village in Mandi District for Chandigarh.

    From Chandigarh, she will be leaving for Mumbai. pic.twitter.com/un6YrNvbnG

    — ANI (@ANI) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 9, 2020, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.