అగ్రనటి కాజల్ అగర్వాల్ ప్రముఖుల సరసన చేరింది. తాజాగా ఈ అమ్మడు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కుటుంబంతో కలిసి పాల్గొందీ అందాల భామ. తన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది కాజల్. వాటిని నటి నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యూజియంలో భారతదేశానికి చెందిన ప్రభాస్, మహేశ్‌బాబు, శ్రీదేవి, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ వంటి ప్రముఖ నటుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వారి పక్కన తను చోటు సంపాదించడంపై కాజల్ ఆనందం వ్యక్తం చేసింది.
లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్.. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 12 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె... కమల్‌హాసన్ 'భారతీయుడు-2', మంచు విష్ణుతో 'మోసగాళ్లు' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.