ETV Bharat / sitara

కరోనాతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ - హరితేజ కరోనా కాన్పు

యాంకర్​గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు హరితేజ సుపరిచితమే. ఇటీవలే ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ సమయంలో తనకు కరోనా పాజిటివ్​ వచ్చిందని.. చాలా ఇబ్బంది పడ్డానని ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Actress Hariteja
హరితేజ
author img

By

Published : Apr 28, 2021, 8:38 PM IST

Updated : Apr 29, 2021, 7:21 AM IST

యాంకర్​గా, నటిగా గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాలతో మెప్పించింది హరితేజ. ఈమెకు ఏప్రిల్ 5న పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ ఫొటోను ఇటీవలే సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. అయితే ఆ పరిస్థితుల్లో తనతో పాటు తన కుటుంబానికి కరోనా పాజిటివ్​గా తేలిందని చెబుతూ భావోద్వేగానికి గురైంది హరితేజ. ఒంటరిగా డెలివరీకి వెళ్లానంటూ వెల్లడించింది.

"పాప పుట్టిందని తెలియగానే చాలా మంది విషెష్‌ చెప్పారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే పరిస్థితుల్లో అప్పుడు లేను. మీ అందరికి థ్యాంక్స్‌. అప్పుడు ఎందుకు రిప్లై ఇవ్వలేదో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఆ విషయం పంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే.. నా విషయం చెప్పుకోవాలనిపించింది. నా వల్ల కొంతమంది అయినా మారుతారేమోనని అనిపించి ఈ వీడియో చేస్తున్నా. నా డెలివరీకి ఒక్క వారం ముందు ఇంట్లో అందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాకు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఏం చేయలో నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువ జాగ్రత్తగా లేకపోవడం వల్లే ఇలా అయిందని అనిపించింది. అప్పుడు నేను చాలా ఇబ్బందికి గురయ్యా. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లే డాక్టర్లు డెలివరీ చేయమని చెప్పారు. దాంతో కొవిడ్‌ ఆస్పత్రులను సంప్రదించా."

"నాకు పాజిటివ్‌ కాబట్టి బేబీకి కూడా వస్తుందని భయపడ్డా. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నా. రిజల్ట్‌ కోసం ఎదురుచూశా. డెలివరీ అంటే సంతోషంగా ఉంటుంది. డెలివరీ టైంలో ఒక్కదాన్నే పోరాడాను. దీపు ఒక్కడే చూసుకున్నాడు. కొవిడ్‌ వార్డులో ఒక్కదాన్నే ఉన్నా. బేబీ పుట్టగానే నా దగ్గర నుంచి తీసుకెళ్లారు. తనకు నెగిటివ్​ వచ్చింది. తన దగ్గర వేరే వాళ్లను ఉంచాల్సి వచ్చింది. తనను వీడియో కాల్‌లో చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా బాధేసింది. మీము ఇంటికి వచ్చాక కూడా మా వాళ్లు అంతా ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎవరినీ సాయం అడగలేని పరిస్థితి. ఎవర్నీ రిస్క్​లో పెట్టలేం. నేను, దీపూ మేనేజ్ చేసుకున్నాం. కొందరు స్నేహితులూ సాయం చేశారు. ఇంకా ప్రతి ఒక్క చోటా ఏ మనకి రాదులే అనే ధైర్యం ఉంటుంది. కానీ అలా వద్దండి. వచ్చిన తర్వాత బాధపడటం వద్దు. ప్రెగ్నెన్సీ ఆడవాళ్లు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మన వల్ల వేరే వాళ్లు ఇబ్బంది పడకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ తన అనుభవాలను పంచుకుంది హరితేజ.

Last Updated : Apr 29, 2021, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.