అయేషా టకియా గుజరాతి అమ్మాయి. ముంబయిలో (10-04-1986) పుట్టింది. తండ్రి నిషిత్. తల్లి ఫరీదా. ఆమె కుటుంబం బ్రిటీష్ మూలాలకి చెందినది. ఆమెకు నటాషా అనే ఓ చెల్లి ఉంది. స్కూల్ నుంచే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పదహారేళ్ల వయసులోనే 'ఐయామ్ ఏ కాంప్లాన్ గర్ల్..' అంటూ సందడి చేసింది. షాహిద్‌కపూర్‌తో కలిసి వ్యాపార ప్రకటనల్లో నటించింది. ఆ తరువాత ఓ మ్యూజిక్ వీడియోలో నటించి బాలీవుడ్‌ని ఆకర్షించింది.
తొలి విజయం
ప్రకటనల్లో ఆయేషా అందాన్నీ, నటనలలోని చురుకుదనాన్ని గమనించిన పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆమెతో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. 'సోచా నా థా', 'టార్జాన్:ది వండర్ కార్' అనే చిత్రాలకు ఆమె సంతకం చేసింది. అందులో మొదట 'టార్జాన్' విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 'దిల్ మాంగే మోర్', 'షాదీ నెంబర్ 1' తదితర చిత్రాలతో అదరగొట్టింది.
తెలుగులో...
హిందీలో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఆయేషా గురించి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుసుకొన్నాడు. 'సూపర్' చిత్రం కోసం తెలుగు పరిశ్రమకు తీసుకొచ్చాడు. అందులో నాగార్జున సరసన ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. 'గుచ్చి గుచ్చి చంపమాకు..' అంటూ ఆయేషాని పాడుకొన్నారు తెలుగు యువతరం. ఆ తర్వాత తమిళంలోనూ అవకాశాలు వచ్చినా.. అటువైపు వెళ్లకుండా హిందీపైనే దృష్టి పెట్టింది.
ముగ్గురితో..
అందరి కథానాయికల్లాగే బోలెడన్ని ప్రేమ కబుర్లు వినిపించింది ఆయేషా. తొలుత సిద్ధార్థ్ కొయిరాలతో ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య చాలా రోజులు డేటింగ్ నడిచింది. ఆ తర్వాత అతడికి గుడ్‌బై చెప్పి అస్మిత్ పటేల్‌కి దగ్గరైంది. కొన్ని నెలలపాటు వీరి మధ్య ప్రేమాయణం సాగిందో లేదో అంతలోనే రియాసేన్ విడుదల చేసిన ఎమ్‌ఎమ్‌ఎస్ క్లిప్‌తో అస్మిత్ పటేల్‌కి గుడ్‌బై చెప్పేసింది. దాంతో రెస్టారెంట్ల ఫరాన్ అజ్మితో ప్రేమలో పడింది. ముంబయిలోని రెస్టారెంట్‌ని నిర్వహిస్తోన్న ఫరాన్ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబు ఆసిమ్ ఫర్హాన్ అజ్మి తనయుడు. అజ్మి, టకియా మధ్య ప్రేమ బంధం పెళ్లికి దారితీసింది. 2009లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. 2013 డిసెంబర్‌లో ఈ జంటకి ఓ బాబు పుట్టాడు.
ఇదీ చూడండి.. రోజుకు 2 వేల ఆహార ప్యాకెట్లను పంచుతున్న అమితాబ్