హీరోయిన్ యామీ గౌతమ్.. బాలీవుడ్ యువ దర్శకుడు ఆదిత్య ధర్‌ను పెళ్లాడింది. ఇరుకుటుంబాలు మాత్రమే హాజరైన ఈ వేడుక శుక్రవారం జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించి, వివాహానికి సంబంధించిన ఫొటో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
యామీ, ఆదిత్య.. 2019లో వచ్చిన 'ఉరి' సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే స్నేహం చిగురించి, అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా యామీ గౌతమ్ పలు సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుత అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'దస్వీ' చేస్తోంది.
ఇది చదవండి: Pranitha Marriage :పెళ్లి పీటలెక్కిన ప్రణీత