కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ప్రజలు, సెలబ్రిటీల కోరిక మేరకు అపురూప టీవీ సీరియల్స్ 'రామాయణం', 'మహాభారతం'ను మళ్లీ దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే రేటింగ్స్, వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి ఈ ధారావాహికలు. 'రామాయణం'లోని రావణుడు పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం ఎపిసోడ్‌ను చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో 84 ఏళ్ల త్రివేది, సీతను రావణుడు అపహరించే దృశ్యాలు ఆసక్తికరంగా వీక్షించారు. ఆ సన్నివేశం క్లైమాక్స్ చూస్తూ తన రెండు చేతులు జోడించారు.
-
#ArvindTrivedi Watching #Ramayana #Ramayan #RamayanOnDDNational pic.twitter.com/gQz6wLHwvP
— Arvind Trivedi (@realRavana) April 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ArvindTrivedi Watching #Ramayana #Ramayan #RamayanOnDDNational pic.twitter.com/gQz6wLHwvP
— Arvind Trivedi (@realRavana) April 12, 2020#ArvindTrivedi Watching #Ramayana #Ramayan #RamayanOnDDNational pic.twitter.com/gQz6wLHwvP
— Arvind Trivedi (@realRavana) April 12, 2020
1987లో వచ్చిన 'రామాయణ్'ను రామానంద్ సాగర్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఇందులో రాముడిగా అరుణ్ గోవలి, సీతగా దీపికా చిఖిలా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ లహరి నటించారు.