తమిళ స్టార్ హీరో విజయ్ను.. ఈరోజు(బుధవారం) ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రశ్నించారు. నెయివెలి, కడలూర్లో 'మాస్టర్' చిత్రీకరణ జరుగుతుండగా ఇది జరిగింది. విజయ్ గత సినిమా 'బిగిల్'(తెలుగులో 'విజిల్') విషయంలో పన్ను ఎగవేసిన నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్‌తో ఈ కథానాయకుడికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అతడిని ఆరా తీశారు.
'మాస్టర్'లో హీరోగా నటిస్తున్నాడు విజయ్. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. 'ఖైదీ' ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.