ETV Bharat / sitara

డైరెక్టర్​ అవ్వాలనుకుని హీరోగా ఛాన్స్​ కొట్టేశాడు

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యామని చెప్పిన కథానాయకుల్ని చాలా మందినే చూశాం. అలాగే దర్శకత్వం చేయాలనుకొని కథానాయకులైన వాళ్లూ చిత్ర పరిశ్రమలో ఎక్కువగానే కనిపిస్తారు. అందులో సిద్ధార్థ్‌ ఒకడు. నేడు (ఏప్రిల్​ 17) ఈ హీరో​ పుట్టినరోజు సందర్భంగా అతడి జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Actor Siddharth Birthday special story
డైరెక్టర్​ అవ్వాలనుకుని హీరోగా ఛాన్స్​ కొట్టేశాడు
author img

By

Published : Apr 17, 2020, 5:13 AM IST

Updated : Apr 17, 2020, 2:54 PM IST

మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్​ ఆరంభించిన సిద్ధార్థ్​.. ఆ తర్వాత కథానాయకుడుగా మారాడు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్‌ భాషల్లో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫలితంగా సిద్ధార్థ్‌కు పాన్‌ ఇండియా నటుడిగానూ గుర్తింపు లభించింది. ఆ తర్వాత నిర్మాతగా, గాయకుడుగా, రచయితగానూ తన సత్తా నిరూపించుకున్నాడు.

సహాయ దర్శకుడిగా..

చెన్నైలో 1979, ఏప్రిల్‌ 17న జన్మించాడు సిద్ధార్థ్‌. ప్రాథమిక విద్యని చెన్నైలోనే పూర్తి చేసి.. దిల్లీ, ముంబయిల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. చిన్నప్పట్నుంచి రచనలపైనా, దర్శకత్వంపైనా మక్కువ కనబరిచేవాడట. ప్రముఖ దర్శకుడు జయేంద్ర.. సిద్ధార్థ్‌ తండ్రికి స్నేహితుడు కావడం వల్ల ఆయన సహాయంతో మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా చేరే అవకాశం వచ్చింది. మణిరత్నం తీసిన 'కన్నథిల్‌ ముథమిట్టల్‌' చిత్రానికి తొలిసారి సిద్ధార్థ్‌ సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

'బాయ్స్​'తో హీరోగా పరిచయం..

'కన్నథిల్​ ముథమిట్టల్​' చిత్ర రచయిత సుజాత సలహా మేరకు.. దర్శకుడు శంకర్‌ తీసిన 'బాయ్స్‌' చిత్రం కోసం నటుడిగా ఆడిషన్స్‌కు హాజరయ్యాడు. అందులో ప్రధాన పాత్రధారిగా ఎంపికయ్యాడు. ఆ చిత్రం తర్వాత సిద్ధార్థ్‌ వెనుదిరిగి చూడలేదు. నటుడిగా బిజీ అయిపోయాడు. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో తొలి అవకాశం అందుకొని.. ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. అప్పట్నుంచి తెలుగులోనే అతడు ఎక్కువ సినిమాలు చేశాడు.

Actor Siddharth Birthday special story
బాయ్స్​

'చుక్కల్లో చంద్రుడు' పరాజయాన్ని చవిచూసినా.. 'బొమ్మరిల్లు'తో సిద్ధార్థ్‌ పేరు మార్మోగిపోయింది. ఆ చిత్రం గురించి పొరుగు చిత్ర పరిశ్రమలూ మాట్లాడుకొన్నాయి. ఆ తర్వాత తీసిన సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం వల్ల కెరీర్‌ నెమ్మదించింది. 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ఓయ్‌', 'బావ', 'అనగనగా ఓ ధీరుడు', '180', 'ఓ మై ఫ్రెండ్‌'... ఇలా వరుసగా సినిమాలు చేసినా 'బొమ్మరిల్లు' స్థాయి విజయం మాత్రం దక్కలేదు.

కోలీవుడ్​పై దృష్టి

కెరీర్​ ఆశాజనకంగా లేకపోవడం వల్ల తమిళ చిత్ర పరిశ్రమవైపు దృష్టిపెట్టాడు సిద్ధార్థ్​. 'జిగర్తాండ'తో అక్కడ మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుని.. హిందీలోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్య 'గృహం' అనే అనువాద చిత్రంతో తెలుగులోనూ సందడి చేశాడు.

Actor Siddharth Birthday special story
'గృహం' సినిమా

తెలుగులో నటుడిగానే కాకుండా పలు చిత్రాల్లో పాటలు పాడి గాయకుడిగానూ మెప్పించాడు సిద్ధార్థ్​. 'అప్పుడో ఇప్పుడో', 'నిన్ను చూస్తుంటే...', 'ఓయ్‌ ఓయ్‌', 'బావ బావ...', 'శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో...' పాటలతో అతడు తెలుగు శ్రోతల్ని అలరించాడు.

సిద్ధార్థ్‌.. 2003, నవంబరు 3న మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకొన్నాడు. 2007లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పలువురు కథానాయికలతో ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. కానీ సిద్ధార్థ్‌ మాత్రం తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ స్పందించలేదు.

ఇదీ చూడండి.. రానాతో బాలకృష్ణ కాదు.. రవితేజ!

Last Updated : Apr 17, 2020, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.