ETV Bharat / sitara

తమిళ నటుడు శరత్ కుమార్​కు కరోనా‌ - నటుడు శరత్ కుమార్

ప్రముఖ తమిళ నటుడు శరత్​కుమార్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన సతీమణి, నటి రాధికా శరత్ కుమార్ ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

sharat kumar
తమిళ నటుడు శరత్ కుమార్​కు కరోనా పాజిటివ్‌
author img

By

Published : Dec 8, 2020, 7:15 PM IST

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత సినిమా షూటింగ్‌లు షురూ అయ్యాయి. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువైంది. తాజాగా తమిళ నటుడు శరత్‌ కుమార్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన భార్య, సినీ నటి రాధికా శరత్‌ కుమార్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపింది.

"ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న శరత్‌కి కరోనా సోకింది. కోవిడ్‌-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. శరత్‌ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాను."

- రాధిక ట్వీట్​, సినీ నటి.

శరత్ కుమార్‌ తెలుగులో.. గ్యాంగ్ లీడర్, బన్నీ, మండే సూర్యుడు మొదలైన సినిమాల్లో నటించారు.

ఇదీ చదవండి:రైతులపై ప్రియాంక చోప్రా ట్వీట్​- నెటిజన్ల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.