మిల్కీ బ్యూటీ తమన్నా, సత్యదేవ్ జంటగా నటిస్తున్న చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. హైదరాబాద్‌లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కన్నడ రీమేక్‌గా తీయనున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. లక్ష్మీభూపాల్ మాటలు రాస్తున్నారు.
నాగశేఖర్ దర్శకత్వంలో నాగశేఖర్, భావన రవిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు చేయడం విశేషం.
