ETV Bharat / sitara

డ్రైవింగ్​ రాదు.. కొద్దిలో ప్రమాదం తప్పింది: సాయికుమార్

author img

By

Published : Jan 13, 2021, 7:00 PM IST

Updated : Jan 13, 2021, 7:36 PM IST

ఇప్పటికీ పూర్తిస్థాయిలో తనకు డ్రైవింగ్(బైక్​ కూడా)​ రాదని చెప్పారు ప్రముఖ నటుడు సాయికుమార్​. చిన్నతనంలో డ్రైవింగ్​ సరిగ్గా రాకపోవడం వల్ల చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి భయంతో బండి నడపటం నేర్చుకోలేకపోయానని అన్నారు.

saikumar
సాయికుమార్​

'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'వావ్​ 3' గేమ్​ షో వ్యాఖ్యాత సాయికుమార్​ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు ఇప్పటికీ డ్రైవింగ్(బైకు కూడా) పూర్తిగా​ రాదని చెప్పారు. చిన్నప్పుడు వచ్చీ రానీ డ్రైవింగ్​తో ఓసారి బస్సు కింద పడబోయి, ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రసారమైన ఈ ఎపిసోడ్​లో మాధవీలత, ఎస్తర్​, అపూర్వ, నందిని రాయ్​ పాల్గొన్నారు. ఇందులో భాగంగా నందినితో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు సాయికుమార్.

"చిన్నప్పుడు మా నాన్న స్కూటర్​ కొన్నారు. అప్పటికే నాకు సైకిలే వచ్చు. దీంతో స్కూటర్​ను నడుపుకుంటూ రోడ్డు మీదకు తీసుకెళ్లాను. ఎదురుగా ఓ బస్సు వచ్చింది. చాలా భయపడ్డాను. అంతలోనే నా వాహనం బస్సు కిందకు, నేను పక్కకు పడిపోయాను. అప్పటి నుంచి డ్రైవింగ్​ అంటే చాలా భయం. ట్రాఫిక్​ లేకుండా రోడ్డంతా ఖాళీగా ఉంటేనే అవసరాన్ని బట్టి నడుపుతాను. మా ఆవిడను తీసుకుని ఒక్క సారి కూడా డ్రైవింగ్​ చేస్తూ బయటకు తీసుకెళ్లలేదు. అప్పట్లో నాకు కారు ఉండేది కాదు. సినిమాకు వెళ్లాలంటే ఓ ఆటోను మాట్లాడుకుని వెళ్లేవాళ్లం" -సాయికుమార్​, ప్రముఖ నటుడు

డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్​.. తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి : ఆయన గొంతు వింటే థియేటర్లో పూనకాలే!

Last Updated : Jan 13, 2021, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.