ETV Bharat / sitara

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్​కు కరోనా - Maanvi Gagroo

ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కరోనా బారినపడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. తమిళ హీరో విష్ణు విశాల్​, స్టార్​ సింగర్ అరిజిత్ సింగ్​ సహా పలువురు బాలీవుడ్​ ప్రముఖులు కూడా ఆదివారం వైరస్​బారిన పడ్డారు.

Rajendra Prasad
రాజేంద్ర ప్రసాద్
author img

By

Published : Jan 9, 2022, 3:15 PM IST

Updated : Jan 9, 2022, 3:57 PM IST

సినీ పరిశ్రమలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఆదివారం కరోనా బారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా స్వల్ప లక్షణాలతో కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన రాజేంద్రప్రసాద్.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా నిలకడగానే ఉందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

విష్ణు విశాల్​కు పాజిటివ్​..

vishnu vishal
విష్ణు విశాల్​

తమిళ యువ హీరో విష్ణు విశాల్​కు కూడా వైరస్​ సోకింది. 2022ను 'పాజిటివ్'​ రిజల్ట్​తో మొదలుపెడుతున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించాడు ఈ హీరో. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కొద్దిగా జ్వరం ఉందని తెలిపారు. తనను ఇటీవలే కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

అరిజిత్​ సింగ్​..

Arijit Singh
అరిజిత్ సింగ్

స్టార్​ సింగర్​ అరిజిత్​ సింగ్ వైరస్​ బారినపడ్డారు. తనతో పాటు తన భార్యకు కొవిడ్​ పాజిటివ్​గా తేలిందని ఇన్​స్టా వేదికగా వెల్లడించారు. ఇంట్లో ఐసొలేషన్​లో ఉన్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

వీరికి కూడా..

నటి మాన్వీ గగ్రూ కూడా ఆదివారం వైరస్​ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలున్నాయని ఆమె వెల్లడించారు. బాగా నిద్రపోతున్నట్లు చెప్పారు.

Maanvi Gagroo
మాన్వీ గగ్రూ

సీనియర్ నటి నఫీసా అలీకి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. అంతకుముందు ప్రముఖ దర్శకుడు మధుర్​ భండార్కర్​ కూడా కరోనా బారినపడ్డారు.

టీవీ నటి హీనా మినహా ఆమె కుటుంబసభ్యులందరూ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​ వేదికగా వెల్లడించారు హీనా. తన కుటుంబాన్ని చూసుకుంటున్నట్లు తెలిపారు.

hina khan
హీనా ఖాన్

షూటింగ్​లు వాయిదా?

మరోవైపు ఇప్పటికే కరోనా బారినపడిన సూపర్ స్టార్ మహేశ్ బాబు సహా ఇతర నటీనటులంతా హోం క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతున్నారు. వరుసగా సినీ పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల సినిమా షూటింగ్​లను, వేడుకలను దర్శక నిర్మాతలు తాత్కాలికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: అన్నకు మహేశ్​ కన్నీటి వీడ్కోలు.. వాట్సాప్​ వీడియో కాల్​లో!

Last Updated : Jan 9, 2022, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.