ETV Bharat / sitara

'వదంతులు నమ్మకండి.. నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది' - ఆందోళనకరంగా రాజశేఖర్​ ఆరోగ్య పరిస్థితి

ఇటీవల కరోనా బారిన పడిన టాలీవుడ్​ హీరో రాజశేఖర్​ ఆరోగ్య పరిస్థితి కాస్త క్లిష్టంగా మారిందని ఆయన కుమార్తె శివాత్మిక ట్విట్టర్​లో వెల్లడించారు. కానీ కొద్దిసేపటికే తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. రాజశేఖర్​ త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థన చేయాలని ఆమె కోరారు.

Actor Rajasekhar health condition is difficult says his daughter Sivathmika
ఆందోళనకరంగా నటుడు రాజశేఖర్​ ఆరోగ్యం!
author img

By

Published : Oct 22, 2020, 10:03 AM IST

Updated : Oct 22, 2020, 11:10 AM IST

టాలీవుడ్​ హీరో రాజశేఖర్​ కుటుంబమంతా ఇటీవల కరోనా బారిన పడింది. వారిలో తన ఇద్దరు కూతుళ్లు మహమ్మారి నుంచి కోలుకున్నారని రాజశేఖర్​ భార్య జీవిత ఇటీవలే తెలిపారు. ప్రసుతం ఆస్పత్రిలో తన భర్తతో పాటు​ ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే రాజశేఖర్​ ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగా మారిందని ట్వీట్​ చేసిన ఆయన కుమార్తె శివాత్మిక.. ఆ వెంటనే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.

Actor Rajasekhar health condition is difficult says his daughter Sivathmika
శివాత్మిక రాజశేఖర్​ ట్వీట్స్​

"నాన్న ప్రస్తుతం కొవిడ్​తో తీవ్రంగా పోరాడుతున్నారు. మాపై మీరు చూపించిన ప్రేమ మమ్మల్ని రక్షించిందని నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలనే అభిమానుల ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటున్నాం" అని ట్విట్టర్​లో శివాత్మిక పేర్కొన్నారు. మరొక ట్వీట్​లో తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేదని.. చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. తన తండ్రి కోలుకోవడానికి అభిమానులు ప్రార్థనలు చేయాలని శివాత్మిక కోరారు.

Last Updated : Oct 22, 2020, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.