ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన గురువు సూపర్‌స్టార్ రజినీకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడితే తానూ కచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తానని స్పష్టం చేశారు లారెన్స్. పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని గతంలో రజినీ చెప్పారు. అయితే తన నిర్ణయాన్ని రజినీకాంత్ వెనక్కి తీసుకోవాలని కోరుతూ లారెన్స్ ట్వీట్ చేశారు.
"నేను గతవారం ట్వీట్ చేసిన తర్వాత చాలా మంది మీడియా స్నేహితులు అడిగారు. 'ప్రతి రాజకీయ పార్టీ మీకు సహాయం చేశారని, అందుకే మీరు వారందరినీ గౌరవిస్తున్నారని చెప్పి.. ఇప్పుడు రజినీకాంత్‌కు ఎలా మీ మద్దతు తెలిపారు. ఒకవేళ రజినీకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే అప్పుడు మీ మద్దతు ఎవరికి ఇస్తారు' అని ప్రశ్నించారు. సూపర్‌స్టార్‌కు ప్రతికూల రాజకీయాలు నచ్చవు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అతనే సీఎం అభ్యర్థిగా ఉండాలని నేనూ కోరుకుంటున్నా. అయితే గతంలో రజినీ చెప్పిన నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. కానీ, ఆ విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించలేకపోతున్నా. నేను మాత్రమే కాదు.. ఆయన అభిమానులు ఎవ్వరికైనా ఈ విషయం మింగుడు పడటం లేదని భావిస్తున్నా" అని లారెన్స్ ట్వీట్ చేశారు.
-
I request Thalaivar to reconsider his decision.🙏🏼🙏🏼🙏🏼@rajinikanth pic.twitter.com/3rvAUhJJEs
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I request Thalaivar to reconsider his decision.🙏🏼🙏🏼🙏🏼@rajinikanth pic.twitter.com/3rvAUhJJEs
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2020I request Thalaivar to reconsider his decision.🙏🏼🙏🏼🙏🏼@rajinikanth pic.twitter.com/3rvAUhJJEs
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2020
ఇదే విషయాన్ని అడుగుతున్నా..
సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఫోన్ మాట్లాడిన ప్రతిసారీ సీఎం అభ్యర్థి విషయంలో పునరాలోచించుకోవాలని ఆయనకు సూచించినట్లు తెలిపారు లారెన్స్. "ప్రతివారం రజినీకాంత్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. ఇది జరుగుతుందని నా హృదయం చెబుతోంది. ఆయన సీఎం అభ్యర్థిగా ఉంటేనే నేను రాజకీయాల్లోకి వస్తాను. ఒకవేళ ఆయన రాకపోతే నేనూ అలాగే నా స్వచ్ఛంద సేవలను కొనసాగిస్తాను" అని వెల్లడించారు.