ETV Bharat / sitara

The Family Man: 'ఆయన వల్లే 'ఫ్యామిలీ మ్యాన్' చేశా' - మూవీ న్యూస్

తాను ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్​ చేయడానికి తన భర్త కారణమని చెప్పింది ప్రియమణి. దీనితో పాటే కెరీర్​, ఫుడ్​ హాబీస్ తదితర విషయాల్ని పంచుకుంది. వాటిని మీరు చదివేయండి మరి..

actor priyamani about family man web series and her personal life
ప్రియమణి
author img

By

Published : Jun 13, 2021, 8:31 AM IST

పెళ్లయ్యాక ఎంతో బిజీ అయ్యానని చెప్పే నటి ప్రియమణి.. 'ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్‌సిరీన్‌తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దాంతోపాటూ మరికొన్ని వెబ్‌సిరీస్‌, రియాలిటీ షోలల్లో మెరిసిన ఈ బెంగళూరు భామ త్వరలో 'నారప్ప', 'విరాటపర్వం'లో కనిపించనున్న సందర్భంగా తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా..

ఫోర్జరీ చేశా!

మాది కేరళ నేపథ్యమైనా నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. నాన్నకు వ్యాపారం ఉండేది. అమ్మ బ్యాంకు ఉద్యోగి. అన్నయ్య కాస్త నిదానంగానే ఉన్నా నేను మాత్రం అల్లరి పనులు చాలానే చేసేదాన్ని. ఏ క్లాసో గుర్తు లేదు కానీ ఓసారి నా ప్రోగ్రెస్‌ కార్డులో అమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేశా. అది తెలిసి అమ్మకు మొదట కోపం వచ్చింది కానీ మరోసారి అలా చెయ్యననేసరికి నవ్వేసింది. రేపు పరీక్షలనగా నా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ రికార్డులను ముందేసుకుని కూర్చునేదాన్ని. అది చూసి నాన్న, అన్నయ్య రాత్రంతా నాతో పాటు కూర్చుని వాటన్నింటినీ పూర్తిచేసేవారు. ఇంట్లో చిన్నదాన్ని కావడం వల్ల ఇలాంటి పనులు ఎన్ని చేసినా వాళ్లకు కోపం వచ్చేది కాదు. పైగా ఇంటికెవరైనా వచ్చినప్పుడు అమ్మానాన్నా ఇవన్నీ చెప్పి నవ్వుకునేవారు. వాటన్నింటినీ ఇప్పుడు తలచుకుంటే నాకూ నవ్వొస్తుందనుకోండీ..

actor priyamani about family man
ప్రియమణి

అవి ఉంటే చాలు

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాక జంక్‌ ఫుడ్‌ పూర్తిగా మానేశా కానీ.. చాట్‌ను మాత్రం వదిలిపెట్టలేదు. చీట్‌మీల్‌లో భాగంగా అప్పుడప్పుడూ చాట్‌ను లాగించేస్తుంటా. ఫిల్టర్‌ కాఫీ, ఉత్తరాది భోజనం ఎదురుగా ఉన్నాయంటే వ్యాయామం, డైటింగ్‌ లాంటివన్నీ మర్చిపోతా.

అమ్మ నుంచినేర్చుకున్నా...

ఎదురుగా ఎలాంటి సమస్య ఉన్నా సరే అమ్మ కంగారుపడేది కాదు, భయపడేది కాదు. సహనంతో దాన్ని పరిష్కరించుకునే మార్గాలు వెతికేది. అమ్మను చూస్తూ పెరిగిన నేను కూడా అదే నేర్చుకున్నా. ఓర్పుగా ఉంటే ఫలితాలు బాగుంటాయని అనుకుంటా.

priyamani favorite food
ప్రియమణికి ఇష్టమైన ఫుడ్

ఖాళీ దొరికితే...

హాయిగా ఇంట్లోనే ఉంటా. నేనూ, మా ఆయన రాజ్‌ కలిసి ఏదో ఒక వెబ్‌సిరీస్‌ చూస్తూ గడిపేస్తాం. లేదంటే కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడేందుకు ప్రయత్నిస్తా. మా అమ్మవల్లే నాకు దానిపైన ఇష్టం పెరిగింది. తను జాతీయ స్థాయి క్రీడాకారిణి.

అలా అవకాశాలొచ్చాయి

స్కూల్లో ఉన్నప్పుడే కాంచీపురం సిల్క్‌తోపాటూ మరికొన్ని దుస్తుల షోరూంలకు మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ గుర్తింపుతోనే పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు భారతీరాజా సర్‌ నన్ను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తరువాత సినిమాలే నా ప్రపంచం అయ్యాయి. దాంతో డిగ్రీని దూరవిద్య ద్వారా పూర్తిచేశా. సినిమా అవకాశం వచ్చినప్పుడు మా ఇంట్లోవాళ్లు మొదట వద్దంటే వద్దన్నారు కానీ చివరకు ఒప్పుకున్నారు.

అదో కోరిక

చిన్నప్పటినుంచీ నాకు ఇంగ్లండ్‌ రాజ కుటుంబ సభ్యులు తమ ప్యాలెస్‌లో ఎలా ఉంటారో చూడాలని కోరిక. మహారాణి లైఫ్‌స్టైల్‌ను చూసే అవకాశం రాకపోవచ్చు కానీ కనీసం మిగతావారు ఎలా ఉంటారో, రోజంతా ఏం చేస్తారో దగ్గరుండి చూడాలని ఉంది.

ఆ పాత్ర చేయాలని...

నాకు 'నరసింహ'లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే నాకు కూడా అలాంటి పాత్ర ఒక్కటైనా చేయాలని ఉంది. పైగా నా గొంతు నెగెటివ్‌ పాత్రలకు బాగుంటుందని కూడా చాలామంది చెబుతుంటారు. చూడాలి మరి చేస్తానో లేదో!

priyamani musthafa raj
భర్త ముస్తఫా రాజ్​తో ప్రియమణి

అతడే నా అండ

మా ఆయన ముస్తఫా రాజ్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్‌. సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్నప్పుడు తనతో పరిచయమైంది. నా ప్రతి విజయం వెనుకా తను అందించిన సహకారం ఎంతో. పెళ్లయిన మూడు రోజులకే సినిమా షూటింగ్‌లకు వెళ్లాల్సి వచ్చినా పాజిటివ్‌గానే తీసుకున్నాడు. ఫ్యామిలీమ్యాన్‌ వెబ్‌సిరీస్‌ అవకాశం వచ్చినప్పుడు కూడా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో... తనే ‘ఆ టీం నీతో అంతసేపు మాట్లాడిందంటే నువ్వు నటించాలని వాళ్లు అనుకుంటున్నారు. కాబట్టి ఓకే చెప్పేయ్‌’ అన్నాడు. రాజ్‌ అలా చెప్పడం వల్లే ఆ సిరీస్‌ చేశా. నాకు ఇంత గుర్తింపూ వచ్చింది. లేదంటే వద్దనే చెప్పేద్దాన్నేమో.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.