ETV Bharat / sitara

సాయి తేజ్​పై పవన్​ కామెంట్స్​.. ఏమన్నారంటే? - సాయి తేజ్​

యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్​ చిత్రం మంచి టాక్​తో దూసుకుపోతోంది. ఈ చిత్రంపై స్పందించారు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్. సాయి తేజ్ నటనను ప్రశంసించారు.

saidharam tej
saidharam tej
author img

By

Published : Oct 3, 2021, 10:00 PM IST

యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం 'రిపబ్లిక్‌'. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. దేవ కట్టా దర్శకుడు. సాయిధరమ్‌ తేజ్‌ కోరిక మేరకు ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

saidharam tej
పవన్ కల్యాణ్ ప్రశంస

ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

saidharam tej
తేజ్ నటనను కొనియాడిన త్రివిక్రమ్

సాయిధరమ్‌ తేజ్‌ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. 'త్వరలోనే మీ ముందుకు వస్తా' అని ఆయన ఇటీవలే ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: Saidharamtej health: ఆస్పత్రి నుంచి సాయిధరమ్​ తేజ్​ ట్వీట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.