దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్నిరాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాయి. ఇలాంటి సమయంలో హీరో నితిన్ మంచి మనసు చాటుకున్నాడు. తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.10 లక్షలు అందజేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు.
"కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు చెరో రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మనందరం కలిసి పోరాడాలి. ఇంట్లోనే భద్రంగా ఉండండి" -హీరో నితిన్ ట్వీట్