ETV Bharat / sitara

'నా పెళ్లి గురించి ఎందుకు బాబు ఇప్పుడు!'

author img

By

Published : Oct 18, 2020, 5:31 PM IST

హీరోగా, సహ నటుడిగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నవదీప్. తాజాగా ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో పాల్గొన్న ఈయన.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

Actor Navdeep about his marriage
'నా పెళ్లి గురించి ఎందుకు బాబు ఇప్పుడు!'

కథానాయకుడిగా, సహ నటుడిగా తెలుగు వారిని మెప్పించిన నవదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ముచ్చటించారు. ఫాలోవర్స్‌ అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ క్రమంలో "పెళ్లి ఎప్పుడు?, ఎందుకు చేసుకోవట్లేదు?" అని పలువురు నెటిజన్లు అదే ప్రశ్న అడగగా.. "ఎందుకు చేసుకోవాలి?.. ఆపండయ్యా బాబు.. ఎప్పుడూ నా పెళ్లి గురించే అడుగుతుంటారు (నవ్వుతూ)" అన్ని చెప్పారు.

అనంతరం.. "ఇటీవల హిమాలయాలకు వెళ్లి వచ్చా. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా" అని ఒకరికి జవాబిచ్చారు. "క్రికెట్‌ చూస్తారా?" అని ప్రశ్నించగా.. "నాకు ఆసక్తి లేని అంశం అది" అని చెప్పారు. "ఇప్పటి వరకు చిరుతో కలిసి పనిచేయలేదు కదా?" అని ప్రశ్నించగా.. "చిరంజీవి గారితో ఇంత వరకు కలిసి పనిచేయలేదు. ఆ అదృష్టం నాకు ఇంకా రాలేదు. వస్తుందని ఆశిస్తున్నా.." అని పేర్కొన్నారు.

ఇంతలో నవదీప్‌తోపాటు యాంకర్‌ అనసూయ లైవ్‌లో చేరారు. హిమాలయాల ట్రిప్‌ గురించి అడిగారు. "ఎంతమంది వెళ్లారు నవదీప్‌" అని ప్రశ్నించగా.. "14 మంది కలిసి వెళ్లాం, ఆరు బైక్‌లు. ఐదు రోజుల ట్రిప్‌. నేను ఇప్పటివరకు మూడుసార్లు హిమాలయాలకు వెళ్లా. బైక్‌పై అక్కడ రైడ్‌కు వెళ్లడం రెండుసార్లు. భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ లేకపోతే ఇలా సంతోషంగా వెళ్లొచ్చు" అని అన్నారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. "మా ఆయన కూడా అదే అంటున్నారు. "నవదీప్‌కు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. కాబట్టి హ్యాపీగా వెళ్తాడు.." అన్నాడు. "ఏ నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఫీల్‌ అవుతున్నావా?" అని నేను మా ఆయన్ను అడిగా (నవ్వుతూ)" అని తెలిపారు.

తర్వాత నటుడు బ్రహ్మాజీ లైవ్‌లోకి వచ్చారు. తను సినిమా షూటింగ్‌ కోసం శంషాబాద్‌లో ఉన్నట్లు చెప్పారు. సాయి శ్రీనివాస్‌, సోనూసూద్‌తో కలిసి నటిస్తున్నానని వెల్లడించారు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. "బ్రహ్మాజీ గారు గొప్ప వ్యక్తి" అని నవదీప్‌ ఫాలోవర్స్‌కు చెప్పగా ఆయన ఇచ్చిన రియాక్షన్‌ నవ్వులు పూయించింది.

అనంతరం నవదీప్‌ తన ఫాలోవర్స్‌లో ఓ మహిళను లైవ్‌లోకి తీసుకున్నారు. "నేను దీన్ని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది.." అని ఆమె సంబరపడిపోయారు. అనంతరం నవదీప్‌ వర్షాల గురించి ప్రస్తావించారు. "హైదరాబాద్‌లో వరదల వల్ల చాలా మంది ప్రభావితమయ్యారు. ఆదుకోమని నాకు రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. నా వంతు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. కానీ, నా ఒక్కడి వల్ల ఇది సాధ్యం కాదు. మీరంతా కూడా చుట్టూ ఉన్న వారికి సాయం చేయండి" అని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.