"వ్యక్తిగతంగా నా సినిమాల్ని చూసేందుకు ఇష్టపడను కానీ 'జెర్సీ' సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు" అని హీరో నాని అంటున్నారు. క్రికెట్ నేపథ్య కథతో రూపొందిన ఈ చిత్రం, గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినీ ప్రియులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివన్ టొరంటోలో దీనిని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో 'జెర్సీ'తో తన అనుబంధాన్ని నాని పంచుకున్నారు.
"జెర్సీ సినిమాను ప్రేక్షకులు అంతగా ఇష్టపడటానికి కారణం అందులోని తండ్రి కొడుకుల ఎమోషన్. ప్రతి ఒక్కరూ చూస్తున్నప్పుడు తమను తాము చూసుకున్నట్లుగా ఫీలయ్యారు. నిజానికి గౌతమ్ తొలిసారి కథ చెప్పినప్పటి నుంచే నేనిలాంటి అనుభూతికి గురవుతూ వచ్చాను. అప్పుడే సినిమా ఎలా ఉండబోతుందన్నది నా మైండ్‌లో ఆలోచన వచ్చేసింది. సెట్స్‌లోకి అడుగుపెట్టేసరికి అర్జున్ ఎలా ఉండాలి? తన బిహేవియర్ ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టతతో లేను. అందుకే నేను, సారా పాత్ర చేసిన శ్రద్ధా.. మా పాత్రలకు అలవాటు పడేందుకు రెండురోజుల సమయం పట్టింది. మూడోరోజు అర్జున్-సారాల మధ్య ఓ ఎమోషనల్ సీన్ తీశారు. అది చేశాక మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు బాలీవుడ్ 'జెర్సీ'తో ఈ కథ దేశం మొత్తం చేరువకానుండటం సంతోషాన్నిస్తుంది" -నాని, కథానాయకుడు
- " class="align-text-top noRightClick twitterSection" data="">