ETV Bharat / sitara

'ఆ విషయాల్లో ఎస్వీఆర్, కమల్​హాసన్​లే స్పూర్తి'

author img

By

Published : Aug 8, 2020, 7:30 AM IST

ఇటీవలే వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మెప్పించిన సీనియర్ నటుడు నరేష్.. చిత్ర విశేషాలను పంచుకున్నారు. తన కెరీర్​ గురించి చెప్పారు. చేస్తున్న ప్రాజెక్టుల గురించి వెల్లడించారు.

'ఆ విషయాల్లో ఎస్వీఆర్, కమల్​హాసన్​లే స్పూర్తి'
సీనియర్ నటుడు నరేష్

"పదేళ్లు సినిమాల్ని వదిలేసి వెళ్లిపోయినా నాకింకా ఆకలి తీరలేదు. ఇప్పుడు అనేక వైవిధ్యభరిత పాత్రలతో ప్రయాణం చేస్తున్నా. నటుడిగా నా పనిని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా. అందుకే మరో పదేళ్ల దాకా నటన నుంచి పక్కకు దృష్టి సారించాలనుకోవట్లేదు. దర్శకత్వం చెయ్యాలన్న కోరిక లేదు" అని అన్నారు సీనియర్‌ నటుడు నరేష్‌. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 'శతమానం భవతి', 'సమ్మోహనం', 'రంగస్థలం' చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించిన ఆయన.. ఇప్పుడు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'లో బాబ్జీగా చక్కటి అభినయంతో మెప్పించారు. సత్యదేవ్‌ హీరోగా వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో ముచ్చటించారు నరేష్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

ఈ సినిమాకు, మీ పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎలా అనిపిస్తోంది?

ఈ చిత్ర విజయం తెలుగు చిత్ర పరిశ్రమకు మైలురాయి లాంటిది. ఎందుకంటే ఓటీటీలో విడుదలై హిట్‌గా నిలిచిన తొలి తెలుగు చిత్రమిదే. ఈ విజయంలో పూర్తి క్రెడిట్‌ దర్శకుడు వెంకటేష్‌ మహా, నిర్మాత శోభు, ప్రవీణలదే. ఇలాంటి గొప్ప చిత్రంలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇటీవల కాలంలో అనేక చిత్రాల్లో ఎన్నో గొప్ప పాత్రలు చేశా. కానీ, ఈ చిత్రంలోని నేను పోషించిన బాబ్జీ పాత్రకొచ్చిన గుర్తింపు మరింత ప్రత్యేకం.

బాబ్జీ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు? ఈ ప్రయాణంలో సవాలుగా నిలిచిన అంశాలేంటి?

విభిన్న పాత్రలు చెయ్యడంలో నేను ఎస్వీ రంగా రావును, కొత్త కొత్త గెటప్పుల్లో కనిపించడంలో కమల్‌హాసన్‌ను స్ఫూర్తిగా తీసుకుంటా. వీటన్నింటి కన్నా ముందు నేను దర్శకుల నటుణ్ని అని చెప్పాలి. ప్రతి దర్శకుడికీ తాను రాసుకున్న పాత్ర పట్ల పూర్తి పట్టు, నమ్మకం ఉంటుంది. నటుడిగా దర్శకుడిలోని ఆ పల్స్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తా. అందుకే ఇలాంటి సవాల్‌తో నిండిన పాత్ర లొచ్చినప్పుడు వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతుంటా. ఇదే పంథాని బాబ్జీ పాత్ర విషయంలోనూ అనుసరించా. వెంకటేష్‌ మహా ఈ చిత్రాన్ని సింక్‌ సౌండింగ్‌ పద్ధతిలో చిత్రీకరించారు. అంటే చిత్రీకరణ సమయంలోనే లైవ్‌లో డైలాగ్‌ రికార్డింగ్‌ చెయ్యడం. ఇది నాకు కొత్త అనుభూతినిచ్చింది. బాబ్జీ పాత్రకు అలవాటు పడటానికి రెండు రోజులు పట్టింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి? సెట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమేనా?

నితిన్‌తో 'రంగ్‌ దే', నానితో 'టక్‌ జగదీష్‌';, వరుణ్‌తేజ్‌ కొత్త చిత్రంలో.. ఇలా దాదాపు అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నా. మరో ఐదారు ప్రాజెక్టులు ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. ఎవరైనా సరే యూనిట్‌ను పూర్తిస్థాయిలో క్వారంటైన్‌ చేసి చిత్రీకరణ జరిపిస్తామంటే సెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమే.

సినిమా సినిమాకూ వైవిధ్యత చూపించాలి. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషిస్తుంటే నాకే బోర్‌ కొడుతుంది. ప్రస్తుతం నాకొస్తున్న పాత్రలన్నీ వేటికవే ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా కొత్తగా ఉంటున్నాయి. అదృష్టవశాత్తూ ప్రేక్షకులూ నన్ను అన్ని రకాల పాత్రల్లో అంగీకరిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా వైవిధ్యత చూపించాలి. విభిన్నమైన ప్రతినాయక ఛాయలున్న పాత్రలూ చెయ్యాలని కోరిక ఉంది. ప్రస్తుతం ఇలాంటివి కొన్ని కథలొచ్చాయి. వాటి మీద వర్క్‌ చేస్తున్నాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.