'గల్లీ బాయ్'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇటీవలే మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెల్చుకుంది. ఇప్పుడు జపాన్లో విడుదలకు సిద్ధమవుతోంది. జపనీయులను వచ్చే నెలలో పలకరించనుంది. ఈ విషయాన్ని హీరో రణ్వీర్ సింగ్ స్వయంగా తెలిపాడు.
"గల్లీ బాయ్ జపాన్లో విడుదలకానుంది. ఇందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. నేను ఇంతవరకు జపాన్ వెళ్లలేదు. సూర్యుడు మొదట ఉదయించే ఆ నేలపై ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయని విన్నాను" -రణ్వీర్ సింగ్, బాలీవుడ్ హీరో.
ఇందులో రణ్వీర్ ర్యాపర్ పాత్రలో అలరించాడు. ఆలియా భట్ కథానాయిక. కల్కి కొచ్లిన్, విజయ్ రాజ్, సిద్ధాంత్ చతుర్వేది ముఖ్యపాత్రలు పోషించారు. జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: డ్యాన్సర్ వీరూ కృష్ణన్కు సెలబ్రిటీల నివాళి