తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో మరో అభ్యర్థి పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, మంచు విష్ణు, హేమ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా 'మా' ఎన్నికల బరిలో నిలిచారు. తనకు ఎలాంటి ప్యానల్ లేదని, అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సీవీఎల్ తెలిపారు. ప్రస్తుత వివాదాల వల్ల తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతుందని వాపోయారు.
తెలంగాణ వాదంతో ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మా అసోసియేషన్ విభజన జరగాలని డిమాండ్ చేశారు. 18 మంది కార్యవర్గ సభ్యుల్లో 9 మంది తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు. సీవీఎల్ ప్రకటనతో మా అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు ఐదుగురు అభ్యురులు బరిలో నిలిచారు.
ఇది చదవండి: MAA elections: 'మా' ఎన్నికలపై మంచు విష్ణు బహిరంగ లేఖ