ETV Bharat / sitara

చియాన్​ విక్రమ్​.. విభిన్న పాత్రలకు కేరాఫ్​ అడ్రస్​ - vikram news

"ఎన్టీఆర్‌ని చూశా... ఏఎన్నార్‌ని చూశా. రజనీని చూశా... కమల్‌నీ చూశా. నీలాంటి నటుడిని మాత్రం ఇప్పటిదాకా చూడలేదురా" అంటాడు ప్రకాశ్​​రాజ్‌. 'అపరిచితుడు'లో విక్రమ్‌ని ఉద్దేశించి! సినిమాలో అది సన్నివేశానికి సంబంధించిన డైలాగే అయినా.. విక్రమ్‌లోని నటనకు ఆ మాటలు​ వర్తిస్తాయంటే అతిశయోక్తి కాదు. ఏ పాత్ర అప్పజెప్పినా అందులో ఇట్టే ఒదిగిపోతాడు. పాత్రల కోసం తనని తాను ఎంతగానైనా మార్చుకొనే నటుడు చియాన్​ విక్రమ్‌. నేడు (ఏప్రిల్​ 17) ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా అతడి జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Actor Chiyaan Cikram Birthday special story
విభిన్న పాత్రలకు కేరాఫ్​ అడ్రస్​ విక్రమ్​
author img

By

Published : Apr 17, 2020, 6:01 AM IST

తమిళంతో పాటు.. తెలుగు, హిందీ భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు విక్రమ్​. 'పితామగన్‌'లో తనదైన నటనకు జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. 1990లో 'ఎన్‌ కాదల్‌ కణ్మణి' చిత్రంతో పరిచయమైన అతడు.. అరంగేట్రంలోనే మలయాళం, తెలుగు భాషల్లో నటించాడు. 'చిరునవ్వుల వరమిస్తావా'తో తొలిసారి తెలుగుతెరపై కనువిందు చేశాడు విక్రమ్‌. ఆ తర్వాత 'విక్కీ' అనే మరో సినిమా చేశాడు.

'బంగారు కుటుంబం', 'ఆడాళ్లా మజాకా', 'ఊహ', 'అక్క బాగున్నావా'... ఇలా 90వ దశకంలో పలు తెలుగు సినిమాలు చేశాడు. తమిళంలో స్టార్‌ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్​ ఇతడు చేసిన సినిమాలు తెలుగులోనూ అనువాదాలుగా విడుదలవుతున్నాయి. విక్రమ్‌కి తెలుగునాట మంచి గుర్తింపు ఉన్నప్పుడే... 'శివపుత్రుడు', 'అపరిచితుడు' చిత్రాలు తీశాడు. ఇవి సూపర్​హిట్​లు కావడం వల్ల అతడికి అభిమానులు మరింత పెరిగారు. 'రావణ్​', 'నాన్న' చిత్రాలతో విక్రమ్‌ ప్రేక్షకులను మెప్పించాడు. శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఐ' కోసం అతడు.. భారీగా బరువు తగ్గి నటించాడు.

Actor Chiyaan Cikram Birthday special story
విక్రమ్​

కెరీర్​లో భారీ బడ్జెట్​ చిత్రాలు..

ప్రస్తుతం విక్రమ్‌ తమిళం, హిందీ భాషల్లో రూ.300 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతోన్న 'మహావీర్‌ కర్ణ', 'కోబ్రా' సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పొన్నియిన్​ సెల్వన్​' చిత్రంలోనూ కనిపించనున్నాడు.

క్రిస్టియన్‌ తండ్రి, హిందూ తల్లికి.. 1966, ఏప్రిల్ 17న పుట్టాడు విక్రమ్​. ఈ హీరో స్వస్థలం మద్రాస్‌. విక్రమ్‌ అసలు పేరు కెన్నడీ జాన్‌ విక్టర్‌. మద్రాసు లయోలా కాలేజీలో చదువుకొన్నాడు. శైలజా బాలకృష్ణన్‌ని 1992లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి ధ్రువ్‌ 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. విక్రమ్‌ నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా ప్రతిభ చాటాడు.

ఇదీ చూడండి.. దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.