కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నాడు యువ హీరో అల్లు శిరీష్(allu sirish movie list). అయితే తాజాగా లైవ్‌లోకి వచ్చిన ఇతడు.. తాను సోషల్ మీడియాకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు శిరీష్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
-
11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason :)
— Allu Sirish (@AlluSirish) November 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason :)
— Allu Sirish (@AlluSirish) November 11, 202111/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason :)
— Allu Sirish (@AlluSirish) November 11, 2021
"2021, నవంబరు 11.. నా వృత్తిజీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ విషయం ఏంటో త్వరలో వెల్లడిస్తా. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్‌మీడియాకు దూరంగా ఉంటా" అని ట్వీట్ చేశాడు శిరీష్(allu sirish movie list).
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు 'పెళ్లి కుదిరిందా..?', 'హాలీవుడ్‌కు వెళ్తున్నారా?' అంటూ ప్రశ్నలు వేశారు. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ఇటీవల తాను ఓ కథ విన్నానని.. ఇది తన కెరీర్లో బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందన్నాడు.
ప్రస్తుతం అల్లు శిరీష్.. 'ప్రేమ కాదంట' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకోసం సిక్స్‌ప్యాక్ పెంచి అందరి దృష్టినీ ఆకర్షించాడు శిరీష్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఇదీ చూడండి: పవన్ 'భీమ్లానాయక్' కొత్త రిలీజ్ డేట్ ఇదే!