ETV Bharat / sitara

'ఖిలాడి'లో విలన్​గా యాక్షన్​కింగ్​ అర్జున్! - ఖిలాడి సినిమాలో అర్జున్

కథానాయకుడు రవితేజ కొత్త చిత్రం 'ఖిలాడి'లో ప్రతినాయకుడిగా యాక్షన్​కింగ్​ అర్జున్​ను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం. యాక్షన్​ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో వీరిద్దరి మధ్య భారీ పోరాట సన్నివేశాలను రూపొందించనున్నారని ప్రచారం జరుగుతోంది.

Action King Arjun turns Villain for Raviteja's Khiladi movie
'ఖిలాడి'లో విలన్​గా యాక్షన్​కింగ్​ అర్జున్!
author img

By

Published : Dec 2, 2020, 9:43 PM IST

మాస్​ మహారాజ్​ రవితేజ హీరోగా, రమేశ్​ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఖిలాడి'. యాక్షన్​ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యాక్షన్​కింగ్ అర్జున్​ను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం. ఇందులో పవర్​ఫుల్​ పాత్రలో అర్జున్​ కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. తమిళ, తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్​.. కొన్ని విలన్​ పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. రవితేజ - అర్జున్ మధ్య భారీ యాక్షన్​ సీక్వెన్స్​ ఉండనున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Action King Arjun turns Villain for Raviteja's Khiladi movie
'ఖిలాడి' చిత్రంలో రవితేజ

ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్​ హయాతీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్​ సంగీతాన్ని అందిస్తున్నారు. 'వీర' చిత్రం తర్వాత రవితేజ-రమేశ్​ వర్మ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రమిదే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.