ETV Bharat / sitara

'ఆచార్య' కథ కాపీ కాదు.. ఆ వార్తలన్నీ అవాస్తవం - మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కాపీ

చిరు 'ఆచార్య' సినిమా కథ కాపీ అంటూ వస్తున్న వార్తలపై చిత్రబృందం ఓ ప్రకటనను విడుదల చేసింది. కొరటాల శివ ఈ స్టోరీని స్వయంగా రాశారని స్పష్టం చేసింది.

'ఆచార్య' కథ కాపీ కాదు.. ఆ వార్తలన్నీ అవాస్తవం
చిరంజీవి ఆచార్య
author img

By

Published : Aug 27, 2020, 4:52 PM IST

Updated : Aug 27, 2020, 5:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' మోషన్ పోస్టర్​ విడుదలై, అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ కథ తనదేనని, కాపీ కొట్టి సినిమా తీస్తున్నారని టాలీవుడ్​లోని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపించారు. ఇప్పుడీ విషయమై స్పందించిన చిత్రబృందం.. 'ఆచార్య' కథను దర్శకుడు కొరటాల శివే స్వయంగా రాశారని తెలిపింది. కాపీ అంటూ వస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

konidela pro note
కొణిదెల ప్రొడక్షన్స్ ప్రకటన

'ఆచార్య' కథను చాలా భద్రంగా ఉంచామని, కొద్దిమందికి మాత్రమే అది తెలుసని చిత్రబృందం పేర్కొంది. కేవలం మోషన్ పోస్టర్​ చూసి కాపీ అనడం భావ్యం కాదని తెలిపింది. దర్శకుడు కొరటాల శివ పేరు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది.

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్​గా నటిస్తోంది. రామ్​చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా ప్రభావం తర్వాత ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభించింది 'ఆచార్య' టీమ్.

Last Updated : Aug 27, 2020, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.