ETV Bharat / sitara

ఆకట్టుకుంటున్న 'బ్రీత్ 2'​ కొత్త టీజర్​ - nitya meenon latest news

సైకలాజికల్ థ్రిల్లర్​గా రూపొందుతోన్న వెబ్ సిరీస్ 'బ్రీత్' రెండో భాగం నుంచి బాలీవుడ్​ హీరో అభిషేక్​ బచ్చన్​ మరో టీజర్​ను విడుదల చేశారు. నిత్యామేనన్​ను పరిచయం చేస్తూ పోస్ట్​ చేసిన ఈ వీడియో.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్​ను జులై 10న విడుదల చేయనుంది చిత్రబృందం.

Abhishek's Breathe Into The Shadows new teaser out
ఆకట్టుకుంటున్న 'బ్రీత్'​ కొత్త టీజర్​
author img

By

Published : Jun 23, 2020, 6:37 PM IST

Updated : Jun 23, 2020, 6:49 PM IST

అభిషేక్ బచ్చన్, నిత్యామేనన్, సయామీ కేర్ వంటి తారాగణంతో తెరకెక్కిన వెబ్​ సిరీస్ 'బ్రీత్: ఇన్​టు ద షాడోస్'. తాజాగా ఈ వెబ్​సిరీస్​ నుంచి నిత్యామేనన్​ను పరిచయం చేస్తూ.. అభిషేక్​ మరో టీజర్​ను విడుదల చేశారు. ఇందులో నిత్యా తన కుమార్తెతో సంతోషంగా ఉండగా.. క్షణంలోనే పాప కనిపించకుండా పోతుంది. తరువాత అభిషేక్‌ బచ్చన్‌ కూడా పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఉత్కంఠగా సాగిన టీజర్​ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందులో నిత్యామేనన్..‌ అభిషేక్‌ బచ్చన్‌ భార్యగా నటిస్తోంది.

మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్​ను జులై 10న అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేయనున్నారు. 2018లో వచ్చిన 'బ్రీత్' మొదటి భాగం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. సైకలాజికల్ థ్రిల్లర్​గా తెరకెక్కిన పార్ట్​-1​లో హీరో మాధవన్ కీలకపాత్ర పోషించారు.

సీట్ ఎడ్జ్​ థ్రిల్లర్​గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్​ రెండో భాగం కోసం ఇప్పటికే ప్రైమ్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి:అభిషేక్ 'బ్రీత్ 2' సిరీస్​ విడుదల తేదీ ఖరారు

Last Updated : Jun 23, 2020, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.