ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కోల్కతా రోడ్లపై కనిపించారు. కొత్త సినిమాలోని టైటిల్ రోల్ కాంట్రాక్ట్ కిల్లర్ 'బాబ్ విశ్వాస్' పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


ఇతడితో పాటు నటి చిత్రాంగద సింగ్ కూడా చీరకట్టులో దర్శనమిచ్చింది. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్ ఖాన్ నిర్మిస్తుండగా, దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ జనవరిలో మొదలైైన షూటింగ్.. కరోనా ప్రభావంతో మార్చిలోనే నిలిచిపోయింది. దాదాపు 8 నెలల విరామం తర్వాత తిరిగి ఈ మధ్యనే కోల్కతాలో ప్రారంభమైంది.