ETV Bharat / sitara

'మాపై ట్రోల్స్​ చేసే వారి ఆరోగ్యం బాగుండాలి' - బచ్చన్​ ట్రోలింగ్స్​పై అభిషేక్​ స్పందన

సోషల్​మీడియాలో తనపై, తన తండ్రి అమితాబ్​పై వస్తున్న ట్రోల్స్​పై తాజాగా స్పందించాడు బాలీవుడ్​ నటుడు అభిషేక్​ బచ్చన్​. తమపై విమర్శలు చేసే వారి ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Abhishek Bachchan gives witty reply to insolent troll
'మాపై ట్రోల్స్​ చేసే వారి ఆరోగ్యం బాగుండాలి'
author img

By

Published : Jul 31, 2020, 9:49 AM IST

కరోనా వైరస్​ సోకి ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్​ నటులు అమితాబ్​ బచ్చన్​, అభిషేక్​ బచ్చన్​లపై సోషల్​మీడియాలో వస్తున్న ట్రోల్స్​పై జూనియర్​ బచ్చన్​ స్పందించాడు. "మీ నాన్నగారు కూడా ఆస్పత్రిలో ఉన్నారు. ఇపుడు మీకు తిండి ఎలా?" అని ఓ నెటిజన్​ అనగా.. "ఇద్దరం ఆస్పత్రిలో పడుకుని తింటున్నాం" అంటూ సమాధానమిచ్చాడు అభిషేక్. దీనికి ట్రోలర్ స్పందిస్తూ.. "త్వరగా కోలుకోండి సార్.. ఇలా పడుకుని తినే అదృష్టం అందరికీ ఉండదు" అంటూ రిప్లై ఇచ్చింది.

Abhishek Bachchan gives witty reply to insolent troll
ట్విట్టర్​లో నెటిజన్లకు రిప్లే ఇచ్చిన అభిషేక్​ బచ్చన్​

దీనిపై అభిషేక్​ స్పందిస్తూ.. "ఏది ఏమైనా మా లాంటి పరిస్థితి మీకు రాకూడదని, మీరు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా." అని తెలిపాడు​.

జులై 11న చేసిన కొవిడ్​ పరీక్షల్లో అభిషేక్​, అమితాబ్​లకు కరోనా సోకిందని నిర్ధరణ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.