అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఏబీసీడీ'. 'అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' అనేది ట్యాగ్ లైన్. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఈ సినిమాతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్నఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అమెరికాలో పుట్టి పెరిగిన హీరోకి బాధ్యతలు గుర్తు చేయడానికి ఓ తండ్రి పెట్టే పరీక్షే ‘ఏబీసీడీ’ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మాస్టర్ భరత్.. శిరీష్‌కు స్నేహితుడిగా కనిపించనున్నాడు.