ETV Bharat / sitara

ఆమిర్​ ఖాన్​ వర్కౌట్స్​కు ఐరా షాక్​! - ఐరా ఖాన్​

'ధూమ్​ 3' సినిమా కోసం బాలీవుడ్​ హీరో ఆమిర్​ ఖాన్ కసరత్తులు చేస్తున్న ఓ వీడియో ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​గా మారింది. దానికి ఆమిర్​ కుమార్తె ఐరాఖాన్​ ఫిదా అయ్యింది.

Aamir Khan's workout video leaves daughter Ira Khan stunned
ఆమిర్​ ఖాన్​ వర్కౌట్స్​కు ఐరాఖాన్​ షాక్​!
author img

By

Published : Aug 3, 2021, 6:12 PM IST

బాలీవుడ్​ కథానాయకుడు ఆమిర్​ ఖాన్​ చేసిన ఓ వర్కౌట్​కు ఆయన కుమార్తె ఐరా ఖాన్​ ఫిదా అయ్యింది. గతంలో 'ధూమ్​ 3' సినిమా షూటింగ్​ సమయంలో ఆమిర్​ చేస్తున్న 'సస్పెండ్​ ఆల్టర్నేటివ్​ డంబెల్​ ప్రెస్​' వర్కౌట్​ వీడియో సోషల్​మీడియాలో ఇప్పుడు వైరల్​గా మారింది. ఈ వీడియోపై ఐరా ఖాన్​ స్పందిస్తూ.. "ఇదేమి ఎక్సర్​సైజ్​?" అని ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​లో పోస్ట్​ చేసింది. ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ట్రైనర్​ స్పందించాడు.

"ఈ ఎక్సర్​సైజ్​ ఛాతితో పాటు కోర్​ కండరాలకు చాలా మంచిది. దీంతో పాటు ఛాతి పనితనంపై మంచి ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా 'ధూమ్ 3' సినిమాలో ఆమిర్​ పాత్ర చేసే విన్యాసాలకు ఈ కసరత్తు ప్రతిరోజూ చేయాల్సిఉంది. అయితే ఈ కసరత్తు వల్ల వీపు భాగంలో ముందుకు వంగినట్లు మార్పు కనిపిస్తుంది. వెన్నెముక ఇలా వంగడం వల్ల బహుశా చూడటానికి అందంగా కనిపించకపోవచ్చు. ఇది కచ్చితంగా మరింత నొప్పిని కలిగిస్తుంది" అని వీడియో పోస్ట్​ చేసిన ట్రైనర్​ వెల్లడించాడు.

ఆమిర్​ ఖాన్​.. తాను నటించే పాత్రల కోసం దేహధారుడ్యాన్ని మార్చుకునేందుకు వెనుకాడడు. 'ధూమ్​ 3' చిత్రం తర్వాత కూడా 'దంగల్​' సినిమా కోసం మరింత బరువు పెరిగి.. ఆ తర్వాత ఫిట్​నెస్​నూ సాధించాడు. ఆమిర్​ ప్రస్తుతం 'లాల్​సింగ్​ చద్దా' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇదీ చూడండి.. 'ఆ వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.