బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో 'గులామ్' సినిమాలో కలిసి నటించిన జావేద్ హైదర్.. ప్రస్తుతం ముంబయి వీధుల్లో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. కరోనా ప్రభావంతో ఆర్థిక కష్టాలు రావడం వల్ల ఇతడు ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బిగ్‌బాస్ ఫేమ్ డాలీ బింద్రా తన ట్విట్టర్లలో పంచుకుంది.
-
He is an actor aaj woh sabzi bech raha hain javed hyder pic.twitter.com/4Hk0ICr7Md
— Dolly Bindra (@DollyBindra) June 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">He is an actor aaj woh sabzi bech raha hain javed hyder pic.twitter.com/4Hk0ICr7Md
— Dolly Bindra (@DollyBindra) June 24, 2020He is an actor aaj woh sabzi bech raha hain javed hyder pic.twitter.com/4Hk0ICr7Md
— Dolly Bindra (@DollyBindra) June 24, 2020
అయితే ఈ వీడియోలో 'దునియా మైన్ రెహనా హై' అనే పాటకు లిప్‌సింక్ ఇస్తూ కనిపించాడు జావేద్. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతడు చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు. "ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని ముందుకు సాగుతున్నావ్" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, "క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఎంచుకున్న మార్గాన్ని మనం గౌరవించాలి" అని మరొకరు ప్రశంసించారు.
కొన్నిరోజుల క్రితం ఇదే తరహాలో 'డ్రీమ్‌గర్ల్' నటుడు సోలాంకి దివాకర్.. దిల్లీలో పండ్లు అమ్ముతూ కనిపించాడు.
జావేద్ హైదర్.. 'గులామ్'తోపాటు బాబర్(2009), లైఫ్ కీ ఐసీ కీ తైసీ(2017) లాంటి సినిమాలు, జెన్నీ ఔర్ జుజు(2012) అనే టీవీ సిరీస్‌లోనూ నటించాడు.
ఇవీ చదవండి: