సినిమా కోసం నటులు ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. పాత్ర డిమాండ్ చేస్తే శరీరాకృతిని మార్చుకోవడం, గుర్రపు స్వారీలు, బైక్ రైడింగులు, కత్తి యుద్ధాలు ఇలా రకరకాలు కళలను నేర్చుకుంటూ విన్యాసాలు చేస్తుంటారు. పాత్రలో లీనమైపోయేందుకు కుటుంబానికి దూరంగా ఉంటూ ఫోన్లను సైతం పక్కన పెట్టేస్తుంటారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇదే కోవకు చెందుతారు. తాను నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' సినిమా కోసం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.
సెట్లో ఉన్నప్పుడు ఫోన్ వల్ల ఏకాగ్రత దెబ్బతినకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఏదైనా తప్పనిసరైతే తన మేనేజర్‌కు కాల్ చేయాలని సన్నిహితులకు చెప్పారట. దీంతో పాటు ఆమీర్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా అతడి టీమే చూసుకుంటోంది. ఈ ప్రక్రియను 'లాల్ సింగ్ చద్దా' సినిమా థియేటర్లలో విడుదల అయ్యేవరకు కొనసాగుతుందని తెలిసింది.
'లాల్ సింగ్ చద్దా' సినిమా హాలీవుడ్ హిట్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్. ఈ చిత్రాన్ని దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్.
ఇదీ చూడండి : అమ్మాయి నో చెప్పిందని గుండు చేయించుకున్న ఆమిర్!