ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధానపాత్రల్లో త్వరలోనే ఓ సినిమా రానుంది. ఇప్పటికే వీరిద్దరూ 'దిల్ చాహ్తా హై'లో కలిసి నటించగా.. తాజాగా తమిళంలో విజయం సాధించిన 'విక్రమ్ వేద'ను రీమేక్ చేయనున్నారు.
రాజా విక్రమాదిత్య కాలానికి చెందిన జానపద కథ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద'. పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించారు. వీరిద్దరే హిందీ సినిమాను తెరకెక్కించనున్నారు. బేతాళ కథలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీయనున్నారు.
కథ మెుత్తం విక్రమ్ అనే పోలీసు, వేద అనే నేరస్థుడి చుట్టూ తిరుగుతుంది. తమిళంలో పోలీసుగా మాధవన్ నటించగా.. నేరస్థుడిగా విజయ్ సేతుపతి కనిపించాడు. బాలీవుడ్లో పోలీసుగా సైఫ్ అలీ ఖాన్, క్రిమినల్‌గా ఆమిర్ ఖాన్ నటించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2020లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
ఇది సంగతి: కోడలి కోసం చిరు ఎలాంటి స్టిల్స్ ఇచ్చాడో చూశారా...