చరవాణి, ఇంటర్‌నెట్... ప్రస్తుతం ఇవి రెండూ మనుషుల జీవన విధానాన్ని శాసిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీతో వెండితెరపై అద్బుతాలు సృష్టిస్తున్న కొందరు దర్శకులకు.. సినిమా లుక్‌లు, వీడియోలు లీక్ కావడం తలనొప్పిగా మారుతోంది. తాజాగా ఇలాంటి అనుభవమే 'లాల్ సింగ్ చద్దా' చిత్రబృందానికి ఎదురైంది. ఇందులో హీరో ఆమిర్‌ఖాన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు వాటినే ట్రెండింగ్ చేస్తున్నారు అతడి అభిమానులు.
ఇందులో ఆమిర్ లుక్ అధికారికంగా విడుదలైనా, లీకులు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. వీటిని నిర్మాతలు అడ్డుకోలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న చిత్రాలకు ఇలాంటి జరగడం సర్వసాధారణమైపోయింది. కొంతమంది సినీ విమర్శకులు మాత్రం ప్రచారంలో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు.