ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చాలా సన్నివేశాల్లో ఆమిర్ కిళ్లీలు నములుతూ కనిపిస్తారు. అయితే నిజజీవితంలో ఆయనకు కిళ్లీ అలవాటు లేదు. కానీ సినిమా షూటింగ్లో ఏకంగా 10,000 కిళ్లీలు వేసుకోవలసి వచ్చిందట.
"ఒక్కోసారి రోజుకు 100 కిళ్లీలు వేసుకోవలసి వచ్చేది. కావలసినప్పుడల్లా కిళ్లీలు కట్టడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని, పూర్తి సరంజామాతో సెట్‌లో ఉంచుకోవలసి వచ్చింది" అని ఆమిర్ చెప్పారు.
దాదాపు ప్రతి టేక్‌కు ఆమిర్ కొత్త కిళ్లీ వేసుకునేవారు. షూటింగ్ మొదలయ్యేలోగా నోరు, పెదాల రంగు తగినంత ఎర్రగా ఉండడానికి 10-15 కిళ్లీలు నమిలేవారట! అందుకే ఆమిర్ నోరుతో పాటు ఆయా సీన్లు కూడా బాగా పండాయి!