ETV Bharat / sitara

రొమాంటిక్​ కామెడీ కథతో సిద్ధమైన ఆది! - ఆది సాయికుమార్ సిమ్రత్ కౌర్​

ఆది సాయికుమార్​, సిమ్రత్​ కౌర్​లు హీరోహీరోయిన్లుగా భాస్కర్​ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఉగాది సందర్భంగా మంగళవారం సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. రొమాంటిక్​ కామెడీ కథాంశంతో సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

aadi saikumar new movie launched on ugadi
రొమాంటిక్​ కామెడీ కథతో సిద్ధమైన ఆది!
author img

By

Published : Apr 14, 2021, 7:32 AM IST

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శిఖర క్రియేషన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సిమ్రత్‌ కౌర్‌ నాయిక. భాస్కర్‌ బంటుపల్లి దర్శకుడు. యుగంధర్‌.టి. నిర్మాత. టి.విజయ్‌కుమార్‌రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప సభాపతి టి.పద్మారావు గౌడ్‌ క్లాప్‌నిచ్చారు. సంజయ్‌ మేఘ, అరుంధతి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. "రొమాంటిక్‌ కామెడీ కథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులకు హాస్యం పంచుతాయి" అని అన్నారు.

ఇదీ చూడండి: సినీపరిశ్రమపై కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.