ETV Bharat / sitara

'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్ర యూనిట్​ మహిళలకు ప్రత్యేక ఆఫర్​.. ఏంటంటే? - ఆడవాళ్లు మీకు జోహార్లు

Aadavallu Miku Joharlu News: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్ర యూనిట్​ మహిళలకు ప్రత్యేక ఆఫర్​ ఇచ్చింది. మహిళా దినోత్సవం(మార్చి8) సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Aadavallu Miku Joharlu:
ఆడవాళ్లు మీకు జోహార్లు
author img

By

Published : Mar 4, 2022, 10:55 PM IST

Aadavallu Miku Joharlu News: మార్చి8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్ర యూనిట్​. మహిళల కోసం ఉచితంగా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఉచిత ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.

Aadavallu Miku Joharlu:
ఆడవాళ్లు మీకు జోహార్లు

శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం మార్చి4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ఈ చిత్రం విశేషంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.

మాదాపూర్​లోని తమ కార్యాలయంలో బాణాసంచా కాల్చి సంబురాలు చేశారు. మహిళలే ప్రాధాన్యంగా తీసిన తమ చిత్రానికి అన్ని చోట్ల మంచి ఆదరణ దక్కుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: నటి సంజనకు అసభ్యకర మెసేజ్​లు.. కొరియోగ్రాఫర్ కుమారుడి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.