ETV Bharat / sitara

'ఆడవాళ్లు..' రిలీజ్ వాయిదా.. సూర్య 'ఈటీ' తెలుగు టీజర్ - Keerthy suresh vaashi movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆడవాళ్లు మీకు జోహార్లు, ఈటీ, శాకుంతలం, వాసి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 19, 2022, 7:21 PM IST

Aadavallu meeku joharlu movie: శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 25న రావాల్సిన ఈ చిత్రాన్ని మార్చి 4న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

Aadavallu meeku joharlu movie
ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ

Samantha shakuntalam movie: సమంత ప్రధానపాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఎప్పుడో షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం నిర్మాణనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సమంత ఫస్ట్​లుక్​ను సోమవారం ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహాభారతం ఆధారంగా తెరకెక్కించారు.

Samantha shakuntalam movie
సమంత శాకుంతలం మూవీ

ET telugu teaser: 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్‌' చిత్రాలతో హీరో సూర్య.. ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు 'ఈటీ'తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శనివారం ఈ చిత్ర తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. సూర్య నుంచి ఆశించే అన్ని రకాల మాస్‌ అంశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. మార్చి 10న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Keerthy suresh vaashi: కీర్తి సురేశ్ నటిస్తున్న మలయాళ సినిమా 'వాసి'. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను సూపర్​స్టార్ మహేశ్​బాబు ట్వీట్ చేశారు. ఇందులో కీర్తి, లాయర్​గా నటిస్తోంది. మలయాళ ప్రముఖ నటుడు టొవినో థామస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Keerthy suresh vaashi
కీర్తి సురేశ్ 'వాసి' మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.