ETV Bharat / sitara

1000 మంది డ్యాన్సర్లతో 'పుష్ప' సాంగ్.. థియేటర్లలో పూనకాలే!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప'కు సంబంధించిన ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. ప్రస్తుతం 1000 మంది డ్యాన్సర్లతో ఓ పాట షూట్ చేస్తున్నామని వెల్లడించింది.

Pushpa
పుష్ప
author img

By

Published : Nov 4, 2021, 1:38 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసిన చిత్రబృందం.. ప్రస్తుతం ఓ అదిరిపోయే సాంగ్​ను షూట్ చేస్తోంది. ఈ పాటను 1000 మంది డ్యాన్సర్లతో రూపొందిస్తుండటం విశేషం. దీపావళి కానుకగా దీనికి సంబంధించిన అప్​డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. ఈ పాట థియేటర్లలో మాస్​ ప్రేక్షకుల చేత ఈలలు కొట్టిస్తుందని వెల్లడించింది.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'సామి సామి' (pushpa songs update), 'దాక్కో దాక్కో మేక'(pushpa dakko dakko meka song), 'శ్రీవల్లి' పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో రష్మిక హీరోయిన్. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు(pushpa movie music director). మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది.

ఇవీ చూడండి: చిరంజీవి అందుకే బాగున్నాడు: మోహన్​బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.