'నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది'.. ఈ ఒక్క డైలాగ్ చాలు థియేటర్ మొత్తం హోరెత్తడానికి. అలాంటిది ఇలాంటి పదుల కొద్ది పంచ్ డైలాగ్‌లు.. అదిరిపోయే స్టెప్పులు.. పోలీస్‌గా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రదర్శన.. ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపిన మాస్ మసాలా సినిమా 'గబ్బర్ సింగ్'.
ఫుల్‌ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు సరైన బాల్ పడితే స్టేడియం అవతలకు కొట్టినట్లు, రెండున్నర గంటలపాటు పవన్ తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ఎన్నాళ్లో నుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల హిట్ దాహం తీర్చారు. ఈ చిత్రం వచ్చిన నేటికి 9 ఏళ్లు. ఈ సందర్భంగా ఇందులో గబ్బర్బాబు చెప్పిన అదిరిపోయే డైలాగ్‌లు మీకోసం.
'గబ్బర్ సింగ్'లో పవర్ఫుల్ డైలాగ్స్
- తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వడానికి నేను దేవుడిని కాదు.. కానీ, తప్పు చేసేవాడికి ఆటోమెటిక్‌గా మన దర్శనం అయిపోద్ది రోయ్
- ఏయ్..! నేను హీరోని కాదు విలన్ నీ
- ఈగ వాలితే మీరు చూసుకోండి ఇంకేమైనా వాలితే నేను చూసుకుంటా
- అసలే పదిమందికి ఉపయోగపడాల్సినోడిని, పది కాలాలపాటు చల్లగా ఉండాలని అశీర్వదించమ్మా.
- రేయ్ బ్లెస్సింగ్స్ కోసం బెండ్ అవుతున్నా, కొంచెం టార్గెట్స్ మీదా కన్నేసి ఉంచండి.
- నాకు మాత్రం మా అమ్మ నాన్న గబ్బర్‌సింగ్ అని పేరు పెట్టారేంట్రా, నేను పెట్టుకోలా
- మానేయడం అంటే పారేయడం కాదురా పక్కనుంచికుని మరి ఆపేయడం
- నా కొంచె తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది
- ఈ గబ్బర్‌సింగ్ స్టేషన్ నుంచి పారిపోవడమంటే పైకిపోవడమే
'గబ్బర్ సింగ్'లో పవర్ఫుల్ డైలాగ్స్
- ఆడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే
- నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవ్వడు పోటీ రాడు, రాలేడు, ఎందుకంటే సిద్ధప్పా! నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ
- రేయ్.. గబ్బర్‌సింగ్ కా ఫౌజియో, గట్టిగా ఉన్నోళ్లు అటెళ్లండి, పొట్టిగా ఉన్నోళ్లు ఇటెళ్లండి, ఫిట్‌గా ఉన్నోళ్లు నా వెనకాల రండి.
- దేవుడా! మా వాళ్లు ఫైటింగ్ చేయకపోయిన పర్లేదు, కనీసం డైటింగ్ చేసేలా చూడు తండ్రి.
- తరతరాలుగా రైడింగ్ చేస్తూనే ఉన్నారు, ఎవరన్నా మారారా? లేదే. అందుకే ఈ సారి ఫైరింగ్ చేద్దాం. బుల్లెట్ దిగితే కానీ బుద్ధి రాదు.
- అరే కోటి.. ఇంకో టీ
- బాగా స్ట్రిక్ట్ అవ్వడానికి స్కూల్లో హెడ్ మాస్టర్ ఏంట్రా? అమ్మాయి రా.. ఓ అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకు పడుద్ది, మరో అమ్మాయి సంవత్సారానికి పడుద్ది, ఫైనల్‌గా ఏ అమ్మాయి అయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టిధర్మం రా
- భాగ్యలక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ కమ్, లేడీస్ ఎంపోరియమ్ కమ్, హ్యాండీక్ర్యాఫ్ట్ కమ్, గిఫ్ట్ షాప్.. ఇన్ని సార్లు కమ్ కమ్ అంటే రామా? వస్తామ్
- రేయ్ ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తెరుస్తారా, అడ్డెడ్డె ఓరి సాంబ రాస్కోరా
- ఆ టైటిల్ అదేరా, నేను నా పైత్యం, వావ్ సాలిడ్ సూపర్బ్..
9 ఏళ్లు పూర్తి చేసుకున్న 'గబ్బర్ సింగ్'
- రేయ్ ఈ ఖాకీ చొక్కా ఉన్నదే నన్ను కంట్రోల్ చేయడానికి, అది తీస్తే ఇంకోలా ఉంటది, ఇప్పుడు చెప్పండ్రా ఉంచి కొట్టనా తీసేసి కొట్టానా.
- మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఒచ్చేస్తాది
- రేయ్ రేయ్ ఆపండ్రా..! వెళ్లేది నా పెళ్లి చూపులకే కదరా.., మరి స్టెప్పులు డల్‌గా వేస్తారేంట్రా? ఎనర్జీ ఏదిరా? ఎనర్జీ తగ్గితే బద్దల్ బాషింగాలు అవుతాయ్ బిడ్డా
- ఏరా..! నీ గుమ్మం లో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంటగా, ఇప్పుడు నీ గుండెల మీద అడుగుపెట్టేవాడు వచ్చాడు చూడు.. సరిగ్గా చూడు.
ఇదీ చూడండి: పవన్-పూరీల 'బద్రి' చిత్రానికి 21 ఏళ్లు