83 Movie Delhi: 1983 ప్రపంచకప్ విజేత జట్టు సారథి, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం '83'. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కపిల్ పాత్రను రణ్‌వీర్‌సింగ్ పోషించగా.. కపిల్ భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. తాజాగా ఈనెల 24న విడుదల కానున్న ఈ చిత్రంపై ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని నిర్ణయించింది దిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం ప్రకటించింది.
దిల్లీ ప్రభుత్వం నిర్ణయంపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
-
Thank you, Shri. @ArvindKejriwal ji and Shri. @msisodia ji, for declaring the film 83 tax-free in Delhi! Your gesture will able us to propagate the tale of India's greatest victory to a wider audience.@therealkapildev #ThisIs83. pic.twitter.com/XVpJXiVvAi
— Reliance Entertainment (@RelianceEnt) December 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you, Shri. @ArvindKejriwal ji and Shri. @msisodia ji, for declaring the film 83 tax-free in Delhi! Your gesture will able us to propagate the tale of India's greatest victory to a wider audience.@therealkapildev #ThisIs83. pic.twitter.com/XVpJXiVvAi
— Reliance Entertainment (@RelianceEnt) December 21, 2021Thank you, Shri. @ArvindKejriwal ji and Shri. @msisodia ji, for declaring the film 83 tax-free in Delhi! Your gesture will able us to propagate the tale of India's greatest victory to a wider audience.@therealkapildev #ThisIs83. pic.twitter.com/XVpJXiVvAi
— Reliance Entertainment (@RelianceEnt) December 21, 2021
ఇప్పటికే 'రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్'లో ఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శితం కాగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. క్రిస్మస్ సందర్భంగా వస్తున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కానుంది.
ఇదీ చూడండి : పవర్‌స్టార్ హీరోగా 'రిపబ్లిక్' సీక్వెల్!