"పవన్ కల్యాణ్ కాన్ఫిడెన్స్ ఏంటి?" అని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. "అది తెలిస్తే మేమందరం ఇన్ని డ్యాన్సులు, ఇన్ని స్టెప్పులు ఎందుకు వేస్తాం"- ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సమాధానం ఇది.
"పవన్ కల్యాణ్ గురించి మీ అభిప్రాయం?"
"తన మ్యాజిక్ నేను ఇష్టపడతాను" - తమిళ అగ్ర నటుడు సూర్య
అల్లు అర్జున్‌కే కాదు ప్రతి ఒక్కరికి కలిగే సందేహం అదే. పవన్ కల్యాణ్ ఉర్రూతలూగించే డ్యాన్సులు వేయడు, అయినా అభిమానుల్ని అలరిస్తాడు.
సూర్యకు మాత్రకే కాదు సినీ అభిమానులందరికీ అంతుపట్టని విషయం పవన్ చేసే మ్యాజిక్.
"స్విచ్ఛాన్ చేస్తే ఒక హీరో. స్విచ్ఛాఫ్ చేస్తే ఒక హీరో కాదు. స్విచ్ఛాన్ చేసినా ఆఫ్ చేసినా హీరో ఒకడే’..." పవన్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన మాట.
పవన్ ట్రెండ్ ఫాలో అవడు. సెట్ చేస్తాడు. తన మ్యానరిజంతో అభిమానుల చేత విజిల్స్ కొట్టిస్తాడు. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సోదరుడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కల్యాణ్ అనతికాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. తన నటన, ఆటిట్యూడ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన కథలనే ఎంపిక చేసుకుని తనదైన మార్క్ చూపించాడు. అభిమానుల చేత 'పవర్ స్టార్' అనిపించుకున్నాడు. తొలుత తన అన్నయ్య చిరంజీవిని చూసి నటనపై ఆసక్తి పెంచుకున్న పవన్.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించి కొన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత వెండితెరకు పరిచయమయ్యాడు.
నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ ప్రతిభ చూపాడు పవన్. కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చి కనువిందు చేశాడు. కథానాయకుడిగా 23 చిత్రాల్లో నటించిన పవన్ కల్యాణ్ ప్రేక్షకులకు పరిచయమై నేటికి 23 ఏళ్లు. కల్యాణ్ హీరోగా వచ్చిన తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' 1996 అక్టోబరు 11న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ హీరో చిత్రాలను గుర్తుచేసుకుందాం..
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
- గోకులంలో సీత
- సుస్వాగతం
- తొలిప్రేమ
- తమ్ముడు
- బద్రి
- ఖుషి
- జానీ
- గుడుంబా శంకర్
- బాలు
- బంగారం
- అన్నవరం
- జల్సా
- పులి
- తీన్‌మార్
- పంజా
- గబ్బర్‌సింగ్
- కెమెరామెన్ గంగతో రాంబాబు
- అత్తారింటికి దారేది
- గోపాల గోపాల
- సర్దార్ గబ్బర్‌సింగ్
- కాటమరాయుడు
- అజ్ఞాతవాసి