బాలీవుడ్లో లేడీ ఒరియెంటెడ్ కథల ట్రెండ్ నడుస్తోంది. 2020 ఏడాదిలోనే అనేక సినిమాలు ఈ జోనర్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే 'చపాక్', 'తప్పాడ్', 'పంగా' సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.
తాప్సి
దర్శకుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తప్పాడ్'. ఈ సినిమాలో తాప్సి కీలకపాత్ర పోషించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

పరిణీతి చోప్రా
2016లో విడుదలైన హాలీవుడ్ చిత్రం 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్'.. అదే టైటిల్‌తో బాలీవుడ్లో రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రధానపాత్రలో పరిణీతి చోప్రా నటించగా.. అదితిరావ్ హైదరీ, కీర్తి కుల్హారీలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

దీపికా పదుకొణే
జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'చపాక్'.. యాసిడ్ దాడి బాధితురాలైన లక్ష్మి అగర్వాల్ జీవితాధారంగా తెరకెక్కింది. ప్రధానపాత్రలో దీపికా పదుకొణే నటించింది.

అలియా భట్
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గంగూబాయి కతియావాడి' చిత్రంలో అలియా భట్ నటిస్తోంది. సినీవర్గాల సమాచారం ప్రకారం అలియా.. ఈ చిత్రంలో వేశ్యగా నటించనుంది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా' మహిళలకు ఆకాశమే హద్దు అని చెప్పిన కార్గిల్ గర్ల్‌ను చూపిస్తుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న భారత వైమానిక దళ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఈ సినిమా.

కియారా అడ్వాణీ
2019లో విడుదలైన బ్లాక్‌బాస్టర్ సినిమాల్లో ఒకటైన 'కబీర్ సింగ్'లో నటించింది కియారా అడ్వాణీ. ప్రస్తుతం 'ఇందూ కి జవానీ' లేడీ ఒరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది.

కంగనా రనౌత్
జనవరి 24న విడుదలైన 'పంగా' చిత్రంలో కంగనా రనౌత్ నటించింది. కబడ్డీ క్రీడాకారిణి అశ్విని అయ్యర్ తివారీ జీవితాధారంగా తెరకెక్కిన సినిమాలో ప్రధానపాత్ర పోషించింది.

విద్యాబాలన్
గణిత శాస్త్రవేత్త శకుంతల దేవి బయోపిక్‌లో విద్యాబాలన్.. టైటిల్ పాత్ర పోషిస్తుంది.

కంగనా రనౌత్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్ 'తలైవి'గా తెరపై కనిపించనుంది కంగనా రనౌత్.

ఇదీ చూడండి.. సినిమాలకు అనుష్క గుడ్‌బై చెప్పేసినట్లేనా?