బాలీవుడ్ హీరో మరణ వార్తను తట్టుకోలేక అతని అభిమానులు కొంత మంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అయితే, తమిళనాడులోని కోయంబత్తూరులో 20 ఏళ్ల యువకుడు సుశాంత్ మార్గాన్నే అనుసరించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. యువకుడు పబ్జీకి బానిస అయ్యాడు. కొద్ది రోజులుగా ఆటను సరిగా ఆడలేకపోతున్నానని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే తన గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుడి గదిలో సూసైడ్ లెటర్‌ను గుర్తించిన పోలీసులు.. అందులో సుశాంత్ మార్గాన్నే అనుసరిస్తున్నట్లు రాసినట్లుగా గుర్తించారు.
ఇదీ చూడండి:'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్'లో సుశాంత్ హీరోగా ఉండాల్సింది!