ETV Bharat / science-and-technology

యూట్యూబ్​లో కొత్త ఫీచర్‌.. ఇక ఆ కష్టాలకు చెక్! - యూట్యూబ్​

వీక్షకుల కోసం మరో కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది యూట్యూబ్. దీని ద్వారా ప్లేబ్యాక్​ విషయంలో ఇకపై చికాకులు తప్పినట్లే.

Youtube
యూట్యూబ్
author img

By

Published : Aug 10, 2021, 8:35 AM IST

యూట్యూబ్ వీక్షకుల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. సాధారణంగా యూట్యూబ్‌లో వీడియోలు చూసేప్పుడు ఫార్వర్డ్‌, రివైండ్ చేసేందుకు స్క్రీన్‌ మీద రెండుసార్లు టచ్ చేస్తాం. అప్పుడు వీడియో పది సెకన్లు ముందుకి లేదా వెనక్కి జరుగుతుంది. అయితే కొన్నిసార్లు మనం చూస్తున్న వీడియో నుంచి తర్వాతి వీడియోకి మారిపోతుంది. దీంతో మరోసారి మనం చూస్తున్న వీడియోని ప్లే చేసి.. గతంలో చూసిన దగ్గర్నించి మొదలుపెట్టాల్సి ఉంటుంది. అలాగే ఫార్వర్డ్‌, బ్యాక్‌వర్డ్ టైమ్‌ పరిమితి తక్కువగా ఉండటం యూజర్స్‌కి కొంత చికాకు కలిగించేది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ స్లైడ్-టు-స్లీక్ పేరుతో సులభంగా వీడియోను ఫార్వర్డ్‌, బ్యాక్‌వర్డ్‌ చేసుకునేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

యూట్యూబ్‌లో ఈ ఫీచర్‌ ద్వారా వీడియో ప్లే చేసిన తర్వాత స్క్రీన్‌ మీద చిన్నగీత, దానిపై వైట్ డాట్ సింబల్‌, పక్కనే స్లైడ్ లెఫ్ట్‌ ఆర్‌ రైట్ టు సీక్ అని అక్షరాలు కనిపిస్తాయి. అలానే స్క్రీన్‌ మీద ఐఫోన్‌లో ఉన్నట్లు గెస్చర్ సింబల్ ఉంటుంది. దాన్ని ఎటువైపు జరిపితే వీడియో ఆ వైపు మారుతుంది. అలా వీడియోలను సులువుగా ఫార్వర్డ్‌, రివైండ్ చెయ్యొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే యూట్యూబ్ v16.31.34 వెర్షన్ ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: వాట్సాప్​లో ఆ లింక్​లను క్లిక్ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్లే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.